SBI Home Loans: గృహ రుణం తీసుకోవాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు ఆఫర్ ఇస్తున్న ఎస్బీఐ.. మిస్ చేసుకోవద్దు..

గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ప్రత్యేక గృహ రుణ క్యాంపెయిన్ లో భాగంగా ఏకంగా 65బేస్ పాయింట్లు(బీపీఎస్) వరకూ తగ్గించి లోన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అంటే లోన్ పై వడ్డీ రేటు తగ్గుతుంది. ఈ ప్రత్యేక తగ్గింపు వచ్చే డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐ వెబ్ సైట్లో ఓ ప్రకటనను జారీ చేసింది.

SBI Home Loans: గృహ రుణం తీసుకోవాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు ఆఫర్ ఇస్తున్న ఎస్బీఐ.. మిస్ చేసుకోవద్దు..
Home Loan
Follow us
Madhu

|

Updated on: Sep 08, 2023 | 1:25 PM

మీరు సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకొంటున్నారా? కానీ అందుకు సరిపడా ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ హోమ్ లోన్. అవునండి.. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. తద్వారా తమ కలల సౌధాన్ని తమకు ఇష్టమైన విధంగా నిర్మించుకుంటున్నారు. ఇక తీసుకున్న లోన్ మొత్తాన్ని నెలవారీ సులభవాయిదాలలో చెల్లింపులు చేసుకుంటున్నారు. అందుకే ఈ హోమ్ లోన్లకు ఇటీవల డిమాండ్ పెరిగింది. ఒకవేళ మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. అద్భుతమైన తగ్గింపు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ మీరు పొందుకోవాలంటే మీ సిబిల్ స్కోర్ బాగా ఉండాల్సిందే మరి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఆఫర్ ఏంటి? సిబిల్ స్కోర్ ఎంత ఉంటే సులభంగా మంచి వడ్డీ రేటుకు లోన్ మంజూరువుతుంది తెలుసుకుందాం..

ఎస్బీఐ ఆఫర్ ఇది..

గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ప్రత్యేక గృహ రుణ క్యాంపెయిన్ లో భాగంగా ఏకంగా 65బేస్ పాయింట్లు(బీపీఎస్) వరకూ తగ్గించి లోన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అంటే లోన్ పై వడ్డీ రేటు తగ్గుతుంది. ఈ ప్రత్యేక తగ్గింపు వచ్చే డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐ వెబ్ సైట్లో ఓ ప్రకటనను జారీ చేసింది. దానిలో పూర్తి వివరాలు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ మీరు దక్కించుకోవాలంటే మీకు తప్పనిసరిగా సిబిల్ స్కోర్ అధికంగా ఉండాలి. సిబిల్ స్కోర్ లేకపోతే ఆఫర్ వర్తించదు. ఈ నేపథ్యంలో అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి? ఎంత ఉండాలి? దానిని ఎలా లెక్కిస్తారు? తెలుసుకుందాం..

సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్ స్కోర్ అనేది రుణం తీసుకోవాలనుకుంటున్న వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ చరిత్ర. ఇది మూడు-అంకెలతో కూడి సంఖ్యాసారాంశం. సాధారణ అర్థంలో చెప్పాలంటే, మీరు గతంలో హోమ్ లోన్, పర్సనల్ లోన్ వంటివి తీసుకుంటే లేదా క్రెడిట్ కార్డ్ వినియోగిస్తూ ఉంటే వాటిని సమర్థంగా నిర్వహిస్తున్నారు అనే విషయాలను తెలియజేసేదే సిబిల్ స్కోర్. ఈ సిబిల్ స్కోర్ విలువ 300 నుంచి 900 మధ్య ఉంటుంది.

ఇవి కూడా చదవండి
  • 750-800 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్‌ల ఉంటే ఎస్బీఐ ఆఫర్ ప్రకారం హోమ్ లోన్ వడ్డీ రేటు 55 బీపీఎస్ పాయింట్లు తగ్గి 8.60%గా ఉంటుంది.
  • 700 -749 మధ్య సిబిల్ స్కోర్ ఉంటే ఎస్బీఐ ఆఫర్ లో 65 బీపీఎస్ తగ్గింపు అందిస్తోంది. ఇప్పుడు మీకు వడ్డీ రేటు 8.7శాతంగా ఉంటుంది.
  • 550- 699 మధ్య సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంక్ ఎలాంటి తగ్గింపునను అందిచదు. అప్పుడు హోమ్ లోన్ పై వడ్డీ రేటు 9.45% నుంచి 9.65% వరకూ ఉంటుంది.

మరిన్ని ప్రత్యేక ఫీచర్లు..

గృహ రుణాలపై ఈ ప్రత్యేక ప్రచారానికి సంబంధించి ఎస్బీఐ కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా జాబితా చేసింది. మహిళా రుణగ్రహీతలకు లభించే వడ్డీ రాయితీలు, ఉత్పత్తి స్థాయిలో లభించే రాయితీలు ఈ క్యాంపెయి రేట్లలో కలిపి ఉంటాయని బ్యాంక్ తెలిపింది. అంతేకాకుండా, 30 లక్షల వరకు రుణాలకు 10 బీపీఎస్ ప్రీమియం కొనసాగుతుంది. సిబిల్ స్కోరు 750 కంటే ఎక్కువ లేదా దానికి సమానమైన రుణగ్రహీతల కోసంమ్యాక్స్ గెయిన్ అండ్ రియాలిటీ లోన్‌ల కోసం కార్డ్ రేట్లపై 5 బీపీఎస్ రాయితీ అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..