Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PhonePe Smart Speakers: ఫోన్ పేలో సరికొత్త ఫీచర్.. ఏకంగా అమితాబ్ వాయిస్‌నే వాడేసిందిగా.. ఇక అభిమానులకు పండగే..

మీరు ఎప్పుడైనా వీధి చివర టిఫిన్ బండి దగ్గరకు వెళ్లి ఏదైనా కొనుగోలు చేసి, గూగుల్ పే గానీ, ఫోన్ పో గానీ, పేటీఎం నుంచి పేమెంట్ చేస్తే.. అవతలి వ్యక్తి డబ్బులు వెళ్లగానే వారి దగ్గర ఉన్న స్పీకర్ రిసీవ్డ్ పేమెంట్ ఆఫ్ రూపీస్ 100 అంటూ ఓ డైలాగ్ లేడీ వాయిస్ లో మనకు వినిపిస్తుంది. ఇప్పుడు ఆ లేడీ వాయిస్ స్థానంలో అమితాబ్ బచ్చన్ వాయిస్ తీసుకొచ్చింది ఫోన్ పే. ఇది లావాదేవీని మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది.

PhonePe Smart Speakers: ఫోన్ పేలో సరికొత్త ఫీచర్.. ఏకంగా అమితాబ్ వాయిస్‌నే వాడేసిందిగా.. ఇక అభిమానులకు పండగే..
Phonepe Smart Speakers
Follow us
Madhu

|

Updated on: Sep 08, 2023 | 4:00 PM

మన దేశంలో ఆర్థిక లావాదేవీల స్వరూపం పూర్తిగా మారిపోయింది. జనాలు జేబుల్లో డబ్బులు పెట్టుకోవడం లేదు. ఖాళీ చేతులతో వచ్చి షాపిం చేసేకుంటున్నారు. మీరు చదువుతున్నది నిజమే. ఈ డిజిటల్ యుగంలో సర్వం స్మార్ట్ అయిపోతున్నాయి. ఇదే క్రమంలో ఆర్థిక రంగం కూడా చాలా వేగంగా డిజిటల్ బాట పడుతోంది. ఇప్పటికే పల్లెలు, పట్టణాలు అని లేకుండా అందరూ క్యూ ఆర్ కోడ్ ఆధారంగా లావాదేవీలు చేసేస్తున్నారు. అందుకోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి స్మార్ట్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ల మధ్య కూడా చాలా పోటీ వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలో అదనపు ఫీచర్లు, అదనపు ఆఫర్లను జోడించి యాప్ బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఫోన్ పే కూడా కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తూ తన పట్టునిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. తన స్మార్ట్ స్పీకర్స్ కు మరింత కొత్తదనాన్ని జోడించి ఆకర్షణీయంగా మార్చింది. ‘సెలెబ్రిటీ వాయిస్’ ఫీచర్ ను కొత్త ప్రవేశపెట్టింది. దీని సాయంతో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ వాయిస్ తో మీరు పేమెంట్స్ పూర్తి చేసుకోవచ్చు. అమితాబ్ వాయిస్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంది. ఇతర భాషల్లో కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సెలెబ్రిటీ వాయిస్ ఫీచర్ కు ఎలా పనిచేస్తుంది? దానిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి తెలుసుకుందాం..

19,000 పోస్టల్ కోడ్స్ లో..

ఫోన్ పే ఈ స్మార్ట్ స్పీకర్ ఫీచర్ ను ఒక ఏడాది క్రితం ప్రారంభించింది. ఇప్పటికే నాలు మిలియన్ల డివైజ్ లను వివిధ రకాల వ్యాపారులు వినియోగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 19,000 పోస్టల్ కోడ్స్ పరిధిలో అంటే దేశంలోని దాదాపు 90శాతం ప్రాంతాలలో ఈ స్మార్ట్ స్పీకర్లను వినియోగిస్తున్నారని ఫోన్ పే చెప్పింది. ఇప్పటి వరకూ వీటి ద్వారా 100 కోట్ల లావాదేవీలు జరిగాయంటే దీని పాపులారిటీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏంటీ స్మార్ట్ స్పీకర్స్..

మీరు ఎప్పుడైనా వీధి చివర టిఫిన్ బండి దగ్గరకు వెళ్లి ఏదైనా కొనుగోలు చేసి, గూగుల్ పే గానీ, ఫోన్ పో గానీ, పేటీఎం నుంచి పేమెంట్ చేస్తే.. అవతలి వ్యక్తి డబ్బులు వెళ్లగానే వారి దగ్గర ఉన్న స్పీకర్ రిసీవ్డ్ పేమెంట్ ఆఫ్ రూపీస్ 100 అంటూ ఓ డైలాగ్ లేడీ వాయిస్ లో మనకు వినిపిస్తుంది. ఇప్పుడు ఆ లేడీ వాయిస్ స్థానంలో అమితాబ్ బచ్చన్ వాయిన్ వాయిస్ తీసుకొచ్చింది ఫోన్ పే. దీని ద్వారా లావాదేవి ఆకర్షణీయంగా మారడంతో పాటు వ్యాపారుడికి, వినియోగదారుడికి మధ్య మరింత ఇంటారిక్టివ్ గా మరుతుంది.

ఇవి కూడా చదవండి

ఎలా ఎనేబుల్ చేయాలంటే..

  • వ్యాపారులు ముందుగా ఫోన్ పే బిజినెస్ యాప్ ను ఓపెన్ చేసి, హోమ్ స్క్రీన్ పై ఉండే స్మార్ట్ స్పీకర్ విభాగంలోకి వెళ్లాలి.
  • దానిలో మై స్మార్ట్ స్పీకర్ కింద ఉండే స్మార్ట్ స్పీకర్ వాయిస్ ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ అమితాబ్ బచ్చన్ వాయిస్ ను హిందీ లేదా ఇంగ్లిష్ భాషలో సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఇది యాక్టివేట్ అవడానికి కొంత సమయం పడుతుంది. ఈ తర్వాత స్పీకర్ రీబూట్ అయ్యి, అమితాబ్ వాయిస్ లో పేమెంట్ నోటిఫికేషన్ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..