AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helpline Numbers: మీ ఫోన్‌లో ఈ 4 నంబర్లు తప్పనిసరిగా సేవ్ చేసుకోండి.. ఆపదలో వెంటనే ఆదుకుంటాయి!

Emergency Helpline Numbers: ఈ నాలుగు నంబర్లు అవసరమైన సమయంలో ఎంతో ఉపయోగపడతాయి. మహిళల భద్రతకు, వినియోగదారుల సమస్యలకు, సైబర్ ఆర్థిక మోసాలకు, తక్షణ అత్యవసర పోలీసు సహాయం కోసం ఉపయోగించండి. వీటిని మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవడంతో పాటు కుటుంబ..

Helpline Numbers: మీ ఫోన్‌లో ఈ 4 నంబర్లు తప్పనిసరిగా సేవ్ చేసుకోండి.. ఆపదలో వెంటనే ఆదుకుంటాయి!
Helpline Numbers
Subhash Goud
|

Updated on: Nov 04, 2026 | 2:40 PM

Share

Emergency Helpline Numbers: మహిళలకు వేధింపులు ఎదురైనా, షాపుల్లో అధిక ధరలకు వస్తువులు విక్రయించినా, ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లో ఈ నంబర్లను సేవ్ చేసుకోవడం మంచిది. అయితే ఈ నంబర్లతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకోవాలి.

1. మహిళల భద్రత కోసం 181

మహిళలు ఎక్కడైనా వేధింపులకు గురైనా, గృహహింస ఎదురైనా, ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నా 181 హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.

  • ఎవరైనా వెంటపడుతున్నా, వేధిస్తున్నా ఫిర్యాదు చేయవచ్చు.
  • గృహహింస, మానసిక వేధింపుల విషయంలో సహాయం కోరవచ్చు.
  • అవసరమైనప్పుడు సంబంధిత సహాయక సేవలకు అనుసంధానం చేస్తారు.
  • మీ సమస్యను వివరించి, అవసరమైతే మీ ప్రాంతం, లొకేషన్ వివరాలు అందించవచ్చు.

ఈ సేవ మహిళలకు కౌన్సెలింగ్, సంబంధిత సహాయం అందించడంలో ఉపయోగపడుతుంది. అయితే 181 అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా పనిచేస్తుందని భావించకూడదు.

ఇవి కూడా చదవండి

2. అవసరమైతే 112

ఇక తక్షణ ప్రాణాపాయం లేదా అత్యవసర పోలీసు సహాయం అవసరమైతే 112కు కాల్ చేయాలి.

3. వినియోగదారుల సమస్యలకు 1915

1915 – National Consumer Helpline

మీరు కొనుగోలు చేసిన వస్తువులో నాణ్యత లోపం ఉన్నా, ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయినా, విక్రయదారుడు అన్యాయం చేసినా 1915 నంబర్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు.. ఒక వస్తువుపై MRP రూ.100 అని ఉంటే, దుకాణదారుడు అదే వస్తువును రూ.120కు విక్రయిస్తున్నాడనుకోండి. అలాంటి సందర్భంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదు చేయవచ్చు.

అలాగే ఈ సమస్యలపైనా ఫిర్యాదు చేయవచ్చు:

  • ఆన్‌లైన్ షాపింగ్‌లో వస్తువు డెలివరీ కాకపోవడం.
  • డబ్బులు తీసుకుని వస్తువు ఇవ్వకపోవడం.
  • నాణ్యత లేని వస్తువులు విక్రయించడం.
  • రీఫండ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం.
  • అన్యాయమైన వ్యాపార పద్ధతులు పాటించడం.

1915కు కాల్ చేసి మీ సమస్యను వివరించవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్ consumerhelpline.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

4. ఆన్‌లైన్ మోసాలకు 1930

1930 – Cyber Crime Helpline

ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గుర్తుతెలియని లింకులు క్లిక్ చేయడం, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లకు ఫోన్ చేయడం, OTPలు చెప్పడం వంటి కారణాలతో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఆర్థిక సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలి.

ఫిర్యాదు చేసేటప్పుడు ఈ వివరాలు సిద్ధంగా ఉంచుకోండి:

  • మీ బ్యాంక్ పేరు.
  • డబ్బులు పోయిన తేదీ, సమయం.
  • ఎంత మొత్తం పోయింది?
  • ట్రాన్సాక్షన్ ఐడీ లేదా UTR నంబర్.
  • మోసానికి సంబంధించిన ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు (తెలిస్తే).

వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల మోసపోయిన డబ్బులను సంబంధిత బ్యాంకు లేదా చెల్లింపు సంస్థ ద్వారా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అయితే డబ్బులు తప్పనిసరిగా తిరిగి వస్తాయని హామీ లేదు. అందుకే ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత మంచిది. అలాగే www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ముఖ్యంగా గుర్తుంచుకోండి:

ఈ నాలుగు నంబర్లు అవసరమైన సమయంలో ఎంతో ఉపయోగపడతాయి. మహిళల భద్రతకు 181, వినియోగదారుల సమస్యలకు 1915, సైబర్ ఆర్థిక మోసాలకు 1930, తక్షణ అత్యవసర పోలీసు సహాయం కోసం 112 ఉపయోగించండి. వీటిని మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా తెలియజేయండి. ఉదాహరణకు.. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఎవరో రూ.20 వేలు దొంగిలించారనుకోండి. వెంటనే ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.

181 – మహిళల హెల్ప్‌లైన్ (Women Helpline)
1915 – వినియోగదారుల హెల్ప్‌లైన్ (National Consumer Helpline)
1930 – సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (Cyber Financial Fraud)
112 – అత్యవసర సహాయం (Emergency Response)
Follow Us