AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rupay Debit Card: రూపే ఏటీఎం కార్డు ఉందా? ఉచితంగా రూ. 10లక్షల మేర ప్రయోజనాలు.. మిస్‌ చేసుకోవద్దు..

మన దేశంలో తొమ్మిదేళ్ల క్రితం రూపే డెబిట్‌ కార్డుల జారీ ప్రారంభమైంది. ఈ రూపే కార్డును అందరూ కలిగి ఉంటున్నా.. దాని ద్వారా వచ్చే ప్రయోజనాలపై చాలా మందికి అవగాహన లేదు. ఈ రూపే డెబిట్‌ కార్డుపై ఉచితంగా రూ. 10లక్షల బీమా సదుపాయం ఉందన్న విషయం కూడా తెలీదు. ఈ నేపథ్యంలో ఈ రూపే కార్డులపే ఉ‍న్న ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Rupay Debit Card: రూపే ఏటీఎం కార్డు ఉందా? ఉచితంగా రూ. 10లక్షల మేర ప్రయోజనాలు.. మిస్‌ చేసుకోవద్దు..
Rupay Debit Cards
Madhu
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 05, 2023 | 9:55 PM

Share

ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన పథకం నిరుపేదలకు బాగా ఉపయోగపడింది. దేశంలో ఒక రకంగా ఆర్థిక విప్లవాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. బ్యాంకు ఖాతాలేని ప్రతి ఒక్కరి చేత జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు ప్రారంభించేందుకు ఇది దోహదపడింది. అనంతర కాలంలో ఈ ఖాతాలు డిజిటల్‌ పేమెంట్లకు బాగా ఉపకరించాయి. వెరసి కింద స్థాయిలో పనిచేసే వ్యక్తులు డిజిటల్‌ పేమెంట్లు చేసే అవకాశం ఏర్పడింది. ఈ ఖాతాల వారికి తొలిసారిగా రూపే డెబిట్‌ కార్డులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. ఆ తర్వాత కాలంలో మిగిలిన ఖాతా దారులకు వీటిని వర్తింపజేశారు. అయితే ఈ రూపే కార్డును అందరూ కలిగి ఉంటున్నా.. దాని ద్వారా వచ్చే ప్రయోజనాలపై చాలా మందికి అవగాహన లేదు. ఈ రూపే డెబిట్‌ కార్డుపై ఉచితంగా రూ. 10లక్షల బీమా సదుపాయం ఉందన్న విషయం కూడా తెలీదు. ఈ నేపథ్యంలో ఈ రూపే కార్డులపే ఉ‍న్న ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రూపే కార్డుల ప్రస్థానం ఇది..

మన దేశంలో తొమ్మిదేళ్ల క్రితం రూపే డెబిట్‌ కార్డుల జారీ ప్రారంభమైంది. ఇది గ్లోబల్ కార్డ్ నెట్వర్క్స్ వీసా, మాస్టర్‌కార్డ్‌లకు దీటుగా ఎదిగింది. ఇటీవలె రూపే క్రెడిట్‌ కార్డులు, వాటిపై యూపీఐ సదుపాయాలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మన దేశంతో పాటు భూటాన్, సింగపూర్, యూఏఈ, నేపాల్ దేశాలకు సైతం రూపే కార్డ్ విస్తరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం 1,100 పైగా ప్రభుత్వ, ప్రైవేట్, రీజనల్ రూరల్, కోఆపరేటివ్ బ్యాంకులు రూపే కార్డులను జారీ చేస్తున్నాయి. మన దేశంలో ఇప్పటి వరకూ 67 కోట్లకు పైగా రూపే డెబిట్‌ కార్డులు ఉన్నాయి. వీటిలో 33 కోట్లకు పైగా కార్డులు కేవలం జన్‌ ధన్‌ ఖాతాలకు సంబంధించినవే కావడం విశేషం. రూపేలో క్లాసిక్, ప్లాటినం, సెలెక్ట్ పేరుతో కార్డులు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రూపే క్రెడిట్‌పై ఆఫర్లు ఇవి..

  • రూపే డెబిట్‌ కార్డు ఉన్న జన్‌ ధన్‌ ఖాతాదారులకు పలు ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అందులో ప్రధానమైనది బీమా. రూ. 2లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాతో పాటు డిసెబిలిటీ కవరేజీ ఉంటుంది.
  •  రూపే ప్లాటినం డెబిట్ కార్డుపై అమెజాన్ పే, స్విగ్గీ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో పలు ఆఫర్లు ఉంటాయి.
  • రూపే క్లాసిక్ కార్డ్‌పై దేశీయ రైల్వే స్టేషన్లు, దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో లాంజ్ యాక్సెస్ చేయొచ్చు. రూ.2 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్, పర్మనెంట్ డిసెబిలిటీ కవరేజి ఉంటుంది.
  • ఆ తర్వాత రకం కార్డు రూపే సెలెక్ట్‌పై అధిక ప్రయోజనాలు లభిస్తాయి. దేశీయ రైల్వే స్టేషన్లు, దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. అలాగే 20కిపైగా ప్రీమియం గోల్ఫ్‌ కోర్స్‌, కాంప్లిమెంటరీ గోల్ఫ్‌ గేమ్‌ యాక్సెస్‌ పొందొచ్చు. అలాగే ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్స్‌ కూడా పొందొచ్చు. జిమ్‌ మెంబర్‌షిప కూడా ఉంటుంది. ఓటీటీ యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవచ్చు. రూ. 10లక్షల వరకూ వ్యక్తిగత ప్రమాద బీమా, పర్మినెంట్‌ డిసెబిలిటీ కవరేజీ లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...