AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: రూ.2వేల నోట్లపై ఆర్బీఐ బిగ్ అప్‌డేట్.. ప్రజల వద్ద ఇంకా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలుసా..?

రూ.2వేల నోట్లు రద్దైనా ఇంకా కొంతమంది దగ్గర ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఈ నోట్లను ఆర్బీఐ రద్దు చేసింది. ప్రజల వద్ద ఉన్న నోట్లను వెనక్కి తీసుకుంది. రూ.6,017 కోట్ల విలువైన 2,000 రూపాయల నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

RBI: రూ.2వేల నోట్లపై ఆర్బీఐ బిగ్ అప్‌డేట్.. ప్రజల వద్ద ఇంకా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలుసా..?
RBI On 2000 Notes
Krishna S
|

Updated on: Aug 01, 2025 | 8:37 PM

Share

రూ.2వేల నోట్లను ఇప్పటికే ఆర్బీఐ రద్దు చేసింది. చెలామణిలో ఉన్న నోట్లను వెనక్కి తీసుకుంది. దానికి కొంత సమయం కూడా ఇచ్చింది. అయినా కొంతమంది వద్ద రూ.2వేల నోట్లు ఇంకా ఉన్నాయి. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. చెలామణి నుండి తొలగించిన రెండేళ్ల తర్వాత కూడా రూ.6,017 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. రెండు వేల రూపాయల బ్యాంక్ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటులో ఉన్నాయి. ఆర్‌బిఐ మే 19, 2023న చెలామణి నుండి రూ.2,000 బ్యాంక్ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 బ్యాంక్ నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు అని ఆర్బీఐ తెలిపింది. ఇది జూలై 31, 2025 నాటికి రూ.6,017 కోట్లకు తగ్గిందని వెల్లడించింది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ.2వేల బ్యాంక్ నోట్లలో 98.31 శాతం తిరిగి వచ్చాయి. రెండు వేల రూపాయల బ్యాంకు నోట్లను మార్చుకునే సౌకర్యం రిజర్వ్ బ్యాంక్ యొక్క 19 ఇష్యూ కార్యాలయాలలో 2023 మే 19 నుండి అందుబాటులో ఉంది.

రూ.2వేల నోట్లను ఈ విధంగా జమ చేయవచ్చు

9 అక్టోబర్ 2023 నుండి రిజర్వ్ బ్యాంక్.. వ్యక్తులు – సంస్థల నుండి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడానికి రూ. 2,000 బ్యాంకు నోట్లను అంగీకరిస్తున్నాయి. ప్రజలు దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా ఇండియన్ పోస్ట్ ద్వారా రూ. 2వేల నోట్లను ఆర్బీఐ యొక్క ఏదైనా ఇష్యూ కార్యాలయానికి పంపి తమ బ్యాంకు ఖాతాలలో జమ చేసుకోవచ్చు. ఈ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలో ఉన్నాయి.

2016లో పుట్టిన నోటు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోటును నవంబర్ 2016లో ప్రవేశపెట్టింది. పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు దేశ కరెన్సీ అవసరాలను త్వరగా తీర్చడానికి ఈ నోటును తీసుకిచ్చింది. ఇది సక్సెస్ కావడంతో పాటు ఇతర నోట్లు తగినంత సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన వెంటనే 2018-19లో రూ.2,000 నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసింది. రూ.2వేల నోట్లలో ఎక్కువ భాగం మార్చి 2017కి ముందు జారీ చేయబడ్డాయి. ఇప్పుడు వాటి జీవితకాలం ముగిసిపోయాయి. లావాదేవీలలో రూ.2,000 నోట్లను ఉపయోగించరు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 31లోగా ఈ పని పూర్తి చేయకుంటే భారీ పెనాల్టీ!
బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 31లోగా ఈ పని పూర్తి చేయకుంటే భారీ పెనాల్టీ!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం