Royal Enfield Electric: వేరే లెవల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. టాప్ గేర్లో ఉత్పత్తి.. త్వరలోనే లాంచింగ్..
రాయల్ ఎన్ ఫీల్డ్.. ఈ పేరే ఓ బ్రాండ్.. యువతకు కలల బండి.. దాని సౌండే ఒక స్టేటస్ సింబల్. అలాంటి బైక్ ను ఎలక్ట్రిక్ వేరియంట్లో త్వరలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టాప్ గేర్లో రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ల ఉత్పత్తి జరగుతోంది.

రాయల్ ఎన్ ఫీల్డ్.. ఈ పేరే ఓ బ్రాండ్.. యువతకు కలల బండి.. దాని సౌండే ఒక స్టేటస్ సింబల్. అలాంటి బైక్ ను ఎలక్ట్రిక్ వేరియంట్లో త్వరలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టాప్ గేర్లో రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ల ఉత్పత్తి జరగుతోంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈఓ గోవిందరాజన్ విశ్లేషకుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అంతేకాక ప్రత్యేకమైన, విభిన్నమైన విధంగా.. ఇప్పటి వరకూ ఎవరూ చూడని విధంగా తమ ఎలక్ట్రిక్ వేరియంట్లు ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై పెట్టుబడి పెట్టడం ప్రారంభించామని.. చెన్నై ప్లాంట్ పరిధిలో సప్లయర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మా లక్ష్యం ఇదే..
రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ గోవిందరాజన్ పలువురు విశ్లేషకులతో మాట్లాడుతూ రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్ ను త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఈవీ ఈవీ ప్రయాణంలో తాము స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాని పేర్కొన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ ఈవీ ప్రయాణం ఇప్పుడు టాప్ గేర్ లో ఉందని స్పష్టం చేశారు. తమ శక్తివంతమైన రాయల్ ఎన్ ఫీల్డ్ డీఎన్ఏతోనే కొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ ఉంటుందని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లకన్నా విభిన్నంగా తమన మోటార్ సైకిల్ ని రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని వివరించారు.
సప్లయర్ వ్యవస్థ..
ఎలక్ట్రిక్ వాహనాలపై బలమైన దీర్ఘకాలిక ఉత్పత్తి, సాంకేతికత రోడ్ మ్యాప్ ను రూపొందించామని గోవిందరాజన్ తెలిపారు. అందుకోసం సప్లయర్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నామని వెల్లడించారు. చెన్నై ప్లాంట్ పరిధిలో సప్లయర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశీయ మార్కెట్లో నెట్ వర్క్ విస్తరణ గురించి మాట్లాడుతూ తమ కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 2,100 రిటైల్ అవుట్ లెట్లను కలిగి ఉందని వివరించారు.



రూ. 1000 కోట్ల పెట్టుబడి..
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఇతర అంశాలపై దృష్టి సారించిన రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1000 కోట్ల క్యాపెక్స్ ప్రకటించింది. ఇందులో కొంత భాగంగా ప్రస్తుత పెట్రోల్ బైక్ ల తయారీ, కొత్త వాటి అభివృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..