- Telugu News Photo Gallery PM Kisan Yojana Scheme: you can be out of eligible beneficiary list by doing this one mistake
PM Kisan: 14వ విడత డబ్బులు మీ ఖాతాలో జమకావాలంటే వెంటనే ఇలా చేయండి.. లేకుంటే..
చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనందిచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. అయితే ఈ చిన్న పొరపాటు చేస్తే వారి ఖాతాల్లోకి డబ్బు జమకాదు. ఎందుకంటే..
Updated on: May 22, 2023 | 3:52 PM

రైతును రాజుగా మార్చాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. దీంతోపాటు అన్నదాతకు ఆసరా కల్పించడం కోసం మోదీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు తీసుకొచ్చింది. రైతుల రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను పరిచయం చేసింది. పెట్టుబడి సాయం కోసం పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు తీసుకొచ్చింది.

2018లో ప్రారంభమైన ఈ పథకంలో చిన్న, సన్నకారు భూమి కలిగిన రైతు కుటుంబాలకు సాగు సహాయం, వారి ఆర్థిక అవసరాల కోసం రూపొందించారు. ఈ పథకం కింద భూమిని కలిగి ఉన్న రైతులకు కేంద్రం ప్రతి 4 నెలలకు (3 సమాన వాయిదాల్లో) రూ.2000, అంటే సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఈ పథకం మొదట్లో 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతుల కోసం ఏర్పాటైంది. 2019 జూన్ 1 నుంచి ఈ స్కీమ్ పరిధిని భూమి ఉన్న రైతులందరికీ అందిస్తున్నారు.

ఏడాదిలో మూడు దఫాలుగా రూ.6వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంటుంది. ఒక్కో విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు చొప్పున జమ చేస్తున్నారు. కేంద్రం ఇప్పటిదాకా ఈ పథకం కింద 13 విడతలుగా నిధులను విడుదల చేసింది.

ఇప్పటివరకు పీఎం కిసాన్ యోజన కింద 13వ విడత విడుదల కాగా, 14వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఇలా చేయాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, EKYC పొందని వారు కూడా PM కిసాన్ యోజన వాయిదా నుండి తొలిగించవచ్చు.

ఇది కాకుండా, తప్పుడు పత్రాలను ఉపయోగించి ఈ పథకం కింద దరఖాస్తు చేసి ప్రయోజనాలను పొందినట్లయితే.. వీరు కూడా అర్హుత కోల్పోతారు. దీనితో పాటు, పిఎం కిసాన్ యోజన కింద ఇప్పటివరకు పెంచిన అన్ని వాయిదాలను కూడా తిరిగి ఇవ్వవలసి ఉంటుంది.

మీరు దీనికి అర్హులా కాదా అనే సమాచారాన్ని PM కిసాన్ పోర్టల్‌లో పొందవచ్చు. మీరు లబ్ధిదారుల జాబితాలో మీ పేరును కూడా తనిఖీ చేయవచ్చు.





























