EV Bikes: లక్ష రూపాయల్లో లక్షణమైన ఈవీ బైక్స్.. ది బెస్ట్ బైక్స్ ఇవే..!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగం రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సగటు సామాన్యుడు ఈవీ వాహనాల వినియోగానికి ముందుకు వస్తున్నాడు. అయితే ఈ ఈవీ వాహనాల్లో చాలా మంది ఈవీ స్కూటర్లనే కొనుగోలు చేస్తున్నారు. కానీ తాజాగా మార్కెట్‌లో ఈవీ బైక్‌లు సరసమైన ధరల్లో లాంచ్ కావడంతో వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో రూ.లక్షకు అందుబాటులో ఉన్న ఈవీ బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఏప్రిల్ 2025లో రిటైల్ గణాంకాల ఆధారంగా 58 శాతం వాటాతో ఈవీ మార్కెట్‌లో ద్విచక్ర వాహనాలు హల్‌చల్ చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ప్రయాణికుల వాహనాలు, వాణిజ్య వాహనాలతో సహా మొత్తం ఈవీ విభాగం సంవత్సరానికి 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం మొదటిసారిగా 1 మిలియన్ అమ్మకాలను సాధించింది. అలాగేసంవత్సరానికి 21 శాతం బలమైన వృద్ధిని చూసింది. ఈ విభాగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కానీ మార్కెట్లో ఆల్-ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో లక్ష రూపాయల లోపు అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లపై ఓ లుక్కేద్దాం.
రివోల్ట్ మోటార్స్ ఆర్‌వీ1
రివోల్ట్ మోటార్స్ ఆర్‌వీ1 మోటర్ బైక్ ధర రూ. 90,000గా ఉంటుంది. రివోల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విభాగంలో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీ ఐదు ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను అందిస్తుంది. రివోల్ట్ ఆర్‌వీ1, రివోల్ట్ ఆర్‌వీ1+, రివోల్ట్ బ్లేజ్ఎక్స్, రివోల్ట్ ఆర్‌వీ400 బీఆర్‌జెడ్, రివోల్ట్ ఆర్‌వీ400. రివోల్ట్ మోటార్స్ లైనప్‌లో అత్యంత సరసమైన వాహనం అయిన రివోల్ట్ ఆర్‌వీ1 నిలుస్తుంది. ఈ బైక్ 2.2 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ సామర్థ్యంతో 2.8 కేడబ్ల్యూహెచ్ మోటారును కలిగి ఉంది. ఆర్‌వీ 12 గంటల 15 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జ్ అవుతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 100 కి.మీ.లేజ్ ఇస్తుంది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, బ్యాటరీపై 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ.ల వారంటీని అందిస్తోంది. అలాగే ఛార్జర్‌పై 2 సంవత్సరాల వారెంటీ అందిస్తుంది.
ఒబెన్ రోర్ ఈజెడ్
ఒబెన్ రోర్ ఈజెడ్ ఈవీ బైక్ ధర రూ. 90,000గా ఉంది. ఒబెన్ రోర్ ఈజెడ్ బైక్ 2.6 కేడబ్ల్యూహెచ్ 3.4 కేడబ్ల్యూహెచ్, 4.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ వస్తుంది. 2.6 కేడబ్ల్యూహెచ్ మోడల్ ధర రూ. 90,000. ఈ బైక్ 52 శ్రీన్‌ఎం టార్క్ తో 7.5 కేడబ్ల్యూహెచ్ (10 bhp) అవుట్‌పుట్‌తో వస్తుంది. ఈబైక్ 95 కిలోమీటర్ల వేగతంతో దూసుకుపోతుంది. కేవలం 3.3 సెకన్లలో 0 – 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 110 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ బైక్‌ను 2 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ బైక్‌కు 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ క్లాస్-లీడింగ్ బ్యాటరీ వారంటీ ఉంది. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఈవీ బైక్ ధర రూ. 99,999గా ఉంది. ఈ బైక్ మూడు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. 2.5 కేడబ్ల్యూహెచ్, 3.5 కేడబ్ల్యూహెచ్, 4.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికల్లో ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. 2.5 కేడబ్ల్యూహెచ్ వెర్షన్ ఓ సారి చార్జ్ చేస్తే 140 కి.మీ మైలేజ్ అందిస్తుంది. అలాగే ఈ బైక్ 7 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని అందుకుంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ బైక్ 6.2 గంటల్లో 0 – 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. ఈ బైక్ కేవలం 3.4 సెకన్లలో 0 – 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఓలా ఎలక్ట్రిక్ ఈ బైక్‌కు 3 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ బ్యాటరీ వారంటీని అందిస్తోంది.
ప్యూర్ ఈవీ ఎకో డ్రైఫ్ట్ జెడ్
ప్యూర్ ఈవీ ఎకో డ్రైఫ్ట్ జెడ్ ధర రూ. 99,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఎకో డ్రైఫ్ట్ 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 3 కేడబ్ల్యూ (4 బీహెచ్‌పీ) గరిష్ట అవుట్‌పుట్, 2 కేడబ్ల్యూ (2.6 బీహెచ్‌పీ) అవుట్‌పుట్‌తో పని చేస్తుంది. ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ బైక్ 5 సెకన్లలో 0 – 40 కిలోమీటర్లు, 10 సెకన్లలో 0 – 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ 3 గంటల్లో 20 – 80 శాతం, 6 గంటల్లో 0 – 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ బైక్‌లో మూడు రైడ్ మోడ్‌లు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








