AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC: వినియోగదారులకు మరోసారి షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు!

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. ఇది దేశంలో ప్రైవేట్‌ బ్యాంకులలో అతిపెద్ద బ్యాంకు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదారులకు మరోసారి షాక్‌ ఇచ్చింది. మే 23వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును..

HDFC: వినియోగదారులకు మరోసారి షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు!
Subhash Goud
|

Updated on: May 27, 2025 | 6:00 AM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును తగ్గించిన తర్వాత దేశంలోని అన్ని బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD)లపై వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. చాలా బ్యాంకులు ఇప్పటికీ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సవరించి తగ్గిస్తున్నాయి. ఈ విషయంలో ప్రైవేట్ రంగ HDFC బ్యాంక్ కొన్ని ఎంపిక చేసిన కాలపు ఎఫ్‌డీ పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు అంటే 0.20 శాతం తగ్గించింది. 3 కోట్ల కంటే తక్కువ విలువ గల FDల కోసం అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఈ మార్పు చేసింది. బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు మే 23, 2025 నుండి అమలులోకి వస్తాయి. అంతకుముందు ఈ బ్యాంక్ కూడా ఏప్రిల్, 2025లో ఎఫ్‌డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

ఇది కూడా చదవండి: Air Conditioner: ఏసీలో ఏ గ్యాస్ ఉంటుంది? కూలింగ్‌ ఉండడానికి అసలు కారణం ఇదే!

సాధారణ పౌరులు ఇప్పుడు ఎఫ్‌డీపై 6.85% వరకు వడ్డీ:

ఎఫ్‌డీ వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత ఇప్పుడు సాధారణ పౌరులు ఎఫ్‌డీపై 3% నుండి 6.85% వరకు వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్లకు 3.5% నుండి 7.35% వరకు వడ్డీ లభిస్తుంది. ఈ తాజా మార్పుకు ముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ పౌరులకు FDలపై 3% నుండి 7.10% వరకు, సీనియర్ సిటిజన్లకు 3.5% నుండి 7.55% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అన్ని కాలపరిమితి గల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గించలేదు. ఈ తగ్గింపు కొన్ని నిర్దిష్ట కాలాలకు మాత్రమే చేసింది.

ఈ కాలాలకు వడ్డీ రేట్లు తగ్గింపు

బ్యాంక్ సాధారణ ప్రజలకు 1 సంవత్సరం కంటే ఎక్కువ, 15 నెలల కంటే తక్కువ మెచ్యూరిటీ వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 0.10% తగ్గించింది. ఇప్పుడు సాధారణ పౌరులు ఈ వ్యవధి FDలపై 6.50% వడ్డీని పొందుతారు. ఇది గతంలో 6.60%గా ఉంది. ఇది కాకుండా 18 నెలల నుండి 21 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీలకు బ్యాంక్ వడ్డీ రేటును 0.20 శాతం పాయింట్లు తగ్గించింది. అంటే 7.05% నుండి 6.85%కి.

ఇది కూడా చదవండి: Youtuber: ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ యూట్యూబర్‌ ఎవరో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్