Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Altroz Racer: బడ్జెట్ కార్ల రంగంలో విప్లవం.. భారత్‌లో నయా కారు రిలీజ్ చేస్తున్న టాటా

టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో ఆల్టోజ్ రేసర్‌ను విడుదల చేయడానికి వేదికను సిద్ధం చేస్తోంది. అయితే ఈ వార్తను ఆ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ ప్రెజెంటేషన్‌కు సంబంధించిన లీకైన చిత్రం ప్రకారం భారతీయ వాహన తయారీదారు జూన్ ప్రారంభంలో కొత్త కారును విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఈ కారు ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఆల్టోజ్ హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించిన  స్పోర్టీ వెర్షన్ అని గమనించాలి.

Tata Altroz Racer: బడ్జెట్ కార్ల రంగంలో విప్లవం.. భారత్‌లో నయా కారు రిలీజ్ చేస్తున్న టాటా
Tata Altroz Racer
Follow us
Srinu

|

Updated on: May 15, 2024 | 4:30 PM

టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో ఆల్టోజ్ రేసర్‌ను విడుదల చేయడానికి వేదికను సిద్ధం చేస్తోంది. అయితే ఈ వార్తను ఆ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ ప్రెజెంటేషన్‌కు సంబంధించిన లీకైన చిత్రం ప్రకారం భారతీయ వాహన తయారీదారు జూన్ ప్రారంభంలో కొత్త కారును విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఈ కారు ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఆల్టోజ్ హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించిన  స్పోర్టీ వెర్షన్ అని గమనించాలి. బ్రాండ్ ఈ కారును రెండుసార్లు ప్రదర్శించింది. ఆటో ఎక్స్పో 2023లో ఒకసారి, ఈ సంవత్సరం భారత్ మొబిలిటీ షోలో కూడా ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో టాటా ఆల్టోచ్ న్యూ వేరియంట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టాటా ఆల్టోజ్ రేసర్ డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో వస్తంది. ఈ కారు బోనెట్, కారు పైకప్పు మధ్యలో రెండు చారలు ఉంటాయి. దాని ప్రత్యేక గుర్తింపులో భాగంగా కారు గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్తో ఫెండర్లపై ‘రేసర్’ బ్యాడ్జ్‌తో వస్తుంది. ఈ కారు లెథెరెట్ అష్తోలరీని పొందుతుంది. ఇది డ్యాష్ బోర్డ్లో కాంట్రాస్ట్ స్టిచింగ్, కలర్ యాక్సెంట్ ద్వారా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ అంశాలన్నీ కారుకు సంబంధించిన స్పోర్టీ అనుభూతిని జోడించడానికి ఉపయోగించబడ్డాయి. సాంకేతికత వైపు హ్యాచ్బ్యాక్లో 360 డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్ప్లే, ఈఎస్‌సీ ప్రామాణిక ఫీచర్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. 

10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్-అసిస్టెడ్ సన్రూఫ్ ఉంటాయి. ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి. భవిష్యత్ లో బ్రాండ్ ఈ ఫీచర్లను సాధారణ వేరియంట్లకు ఫార్వార్డ్ చేసే  అవకాశం ఉంది. టాటా ఆల్టోజ్ రేసర్లో 1.2 లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనిని బ్రాండ్ నెక్సాన్లో ఉపయోగిస్తుంది. ఈ పవర్ యూనిట్ దాని పనితీరులో గరిష్టంగా 120 హెచ్‌పీ శక్తిని, 170 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది ఇండియన్ మార్కెట్లో విక్రయించే ఆల్టోజ్ ఐటర్బో కంటే 10 హెచ్‌పీ, 30 ఎన్ఎంమ్ ఎక్కువ. ఈ కారుకు సంబంధించిన స్పోర్టీ వెర్షన్ చక్రాలకు శక్తిని బదిలీ చేయడానికి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?