Car Safety: కార్లలో కొత్త ట్రెండ్.. ‘అడాస్’ ఫీచర్లతో భద్రతకు భరోసా..
నగర జీవనశైలిలో భాగంగా కారు తప్పనిసరి అవుతోంది. అనుకున్న సమయానికి వెళ్లడానికి, సమయం సద్వినియోగం చేసుకోవడానికి, ప్రయాణ భద్రత కోసం కూడా వినియోగం పెరిగింది. నేడు కార్లలో అనేక ఆధునిక ఫీచర్లు వచ్చాయి. వాహనాన్ని చాలా సులువుగా నడపటానికి, ప్రయాణ భద్రతకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
దేశంలో కార్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. మధ్యతరగతి ప్రజలు కూడా సొంత కారును వినియోగిస్తున్నారు. పెరుగుతున్న నగర జీవనశైలిలో భాగంగా కారు తప్పనిసరి అవుతోంది. అనుకున్న సమయానికి వెళ్లడానికి, సమయం సద్వినియోగం చేసుకోవడానికి, ప్రయాణ భద్రత కోసం కూడా వినియోగం పెరిగింది. నేడు కార్లలో అనేక ఆధునిక ఫీచర్లు వచ్చాయి. వాహనాన్ని చాలా సులువుగా నడపటానికి, ప్రయాణ భద్రతకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
పెరిగిన డిమాండ్..
ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఫీచర్ క్రూజ్ కంట్రోల్. ఇది ఉన్న కారును కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. క్రూయిజ్ కంట్రోల్ ఆధునిక కార్లలో, ముఖ్యంగా మాస్ మోడల్‌లలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
భద్రతకు ప్రాధాన్యం..
సాంకేతికత, సాఫ్ట్‌వేర్ ద్వారా నడిచే లక్షణాలు ఆధునిక కార్లలో మరింత ఎక్కువగా ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా వాహన భద్రతపై వినియోగదారులకు అవగాహన బాాగా పెరుగుతోంది. దానికి అనుగుణంగా కార్ల తయారీదారులు విస్తృత శ్రేణి భద్రతా లక్షణాలను ప్రవేశపెడుతున్నారు. దీనిలో అడాస్ అనే ఫీచర్ చాలా ముఖ్యమైంది.
అడాస్ (ADAS) అంటే?
అడాస్ అంటే అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్. అంటే ఆధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇది మాస్ మార్కెట్ మోడళ్లకు సంబంధించిన అనేక ఆధునిక కార్లలో ఏర్పాటు చేస్తున్నారు. అడాస్ అంటే వెహికల్ సేఫ్టీకి సంబంధించిన ఫీచర్ల సమూహం. కాంపాక్ట్ ఎస్ యూవీలలో అడాస్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నారు. అలాగే మహీంద్రా ఎక్స్ యూవీ 3XO స్థాయి అడాస్ తో వస్తుంది. ఈ విభాగంలోని ఇతర మోడళ్లు వాటి సంబంధిత టాప్ ఎండ్ వేరియంట్‌లలో లెవల్ 1 అడాస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
భద్రతా లక్షణాలు..
ఒక్కమాటలో చెప్పాలంటే అడాస్ అనేది చాలా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ల సహకారంతో పనిచేసే భద్రతా లక్షణాల సమూహం. దీని హార్డ్‌వేర్‌లో సెన్సార్లు, రాడార్, సెమెరాస్ మొదలైనవి ఉన్నాయి. ఈ వ్యవస్థలోని భద్రతా లక్షణాలలో క్రూయిజ్ కంట్రోల్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, పార్క్ అసిస్ట్, రియర్ కొలిషన్ వార్నింగ్, సరౌండ్ వ్యూ, పాదచారులను గుర్తించే సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ట్రాఫిక్ డిటెక్షన్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. డిగ్ రికగ్నిషన్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రాకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మొదలైనవి. ఈ లక్షణాలలో క్రూయిజ్ నియంత్రణ చాలా ప్రజాదరణ పొందింది మరియు మాస్ మార్కెట్ విభాగంలో కూడా అనేక కార్లకు విస్తృతంగా అందుబాటులో ఉంది.
ఎంతో ఉపయోగం..
క్రూయిజ్ కంట్రోల్ అంటే తగిన స్పీడ్లో కాన్ స్టెంట్ గా వెళ్లడం. దీని ద్వారా డ్రైవర్ ఒక స్పీడ్ లిమిట్ పెట్టుకోవచ్చు. తద్వారా యాక్సిలరేటర్ ను తరచూ ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనిలో మరో అడ్వాన్స్ డ్ ఫీచర్ కూడా ఉంది. దాని పేరు అడాఫ్టివ్ క్రూజ్ కంట్రోల్. సాధారణ క్రూజ్ కంట్రోల్ కు ఇది అప్ డేటెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. దీనిలో ఒకసారి స్పీడ్ లిమిట్ ను సెట్ చేస్తే వాహనం ఆ స్పీడ్ లో ప్రయాణించడంతో పాటు ట్రాఫిక్ కు అనుగుణంగా వేగాన్ని నియంత్రించుకుంటుంది. ఫలితంగా ప్రయాణంలో భద్రత పెరుగుతుంది. ఆటోమేటిక్ బ్రేకింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని కారు వేగాన్నిపెంచుతుంది, తగ్గిస్తుంది. క్రూజ్ కంట్రోల్ ను ఒక బటన్ ద్వారా యాక్టివేట్, డీయాక్టివేట్ చేయవచ్చు. స్టీరింగ్ వీల్ మీద ఉండే కన్సోల్ లో క్రూయిజ్ కంట్రోల్ సెట్టింగులు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..