Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI MPC Meeting: బ్యాంకుల్లో కీలక వడ్డీ రేట్లు తగ్గేది లేదా పెరిగేది అప్పుడే.. కీలక తేదీలను ప్రకటించిన ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య విధాన కమిటీ ఎప్పుడు సమావేశమవుతుంది. సమావేశం అయ్యే తేదీలను ప్రకటించింది ఆర్బీఐ. ఆర్బీఐ తన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ.. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వచ్చే ఆర్థిక సంవత్సరంలో..

RBI MPC Meeting: బ్యాంకుల్లో కీలక వడ్డీ రేట్లు తగ్గేది లేదా పెరిగేది అప్పుడే.. కీలక తేదీలను ప్రకటించిన ఆర్బీఐ
RBI
Follow us
Subhash Goud

|

Updated on: Mar 25, 2023 | 5:59 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య విధాన కమిటీ ఎప్పుడు సమావేశమవుతుంది. సమావేశం అయ్యే తేదీలను ప్రకటించింది ఆర్బీఐ. ఆర్బీఐ తన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ.. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరు సార్లు నిర్వహించనున్ననట్లు తెలిపింది. దీని ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, అలాగే ఫిబ్రవరి 2024లో జరుగుతుంది.

2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఎంపీసీ సమావేశం వచ్చే నెలలో అంటే ఏప్రిల్‌లో జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి సమావేశం ఏప్రిల్ 3-6 తేదీలలో జరుగుతుందని ఆర్బీఐ విడుదల చేసిన షెడ్యూల్‌లో తెలిపింది. ఈసారి మాత్రం ఆర్‌బీఐ రేట్లు పెంచకపోవచ్చని, అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను నిరంతరం పెంచడం వల్ల ఆర్‌బీఐపై ఒత్తిడి పెరిగి కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2023-24 సంవత్సరానికి ఆర్బీఐ ఎంపీసీ సమావేశ తేదీలు

  • ఏప్రిల్ 3, 5, 6తేదీల్లో
  • జూన్ 6-8
  • ఆగస్టు 8-10
  • అక్టోబర్ 4-6
  • డిసెంబర్ 6-8
  • 2024 ఫిబ్రవరి 6-8

రిజర్వ్ బ్యాంక్ ఈ ద్రవ్య విధాన కమిటీకి ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో సెంట్రల్ బ్యాంక్ ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు. ముగ్గురు బాహ్య సభ్యులు కూడా ఎంపీసీ సమావేశానికి హాజరవుతారు. మూడు రోజుల ఆర్బీఐ సమావేశంలో ఈ ఐదుగురు సభ్యులు కలిసి ఆర్థిక, దేశీయ పరిస్థితులను సమీక్షిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత ఎంపీసీ సమావేశంలోనే ప్రపంచ ఆర్థిక సవాళ్లు వేగంగా పెరుగుతున్నాయని, దీని కారణంగా భారత్‌లో కూడా సెంట్రల్ బ్యాంక్ అప్రమత్తమైన విధానాన్ని అవలంబించాల్సి ఉంటుందని చెప్పారు. అదే సమయంలో గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభంతో పాటు US ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా దీనికి మద్దతు ఇస్తూ ఇటీవల వడ్డీరేట్లను పెంచాయి. ఇదిలావుండగా, భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ మంచి స్థితిలో ఉందని విధాన నిర్ణేతలు, నిపుణులు అంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి