Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retirement Plan: ఎస్‪బీఐలో పెన్షన్ అకౌంట్ ఎన్‪పీఎస్ తీసుకుంటే ఎంత లాభమో తెలుసా? పూర్తి వివరాలు తెలుసుకోండి.

కేంద్ర ప్రభుత్వం భరోసా కూడా ఉండే పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్ పీఎస్). దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌పీఎస్‌ స్కీమ్‌ ద్వారా ఆకర్షణీయమైన మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లను అందిస్తుంది. ఇతర ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Retirement Plan: ఎస్‪బీఐలో పెన్షన్ అకౌంట్ ఎన్‪పీఎస్ తీసుకుంటే ఎంత లాభమో తెలుసా?  పూర్తి వివరాలు తెలుసుకోండి.
Nps Scheme
Follow us
Madhu

|

Updated on: Mar 25, 2023 | 5:15 PM

కోవిడ్ తదనంతర పరిణామాల్లో పొదుపు పథకాలకు ప్రజలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భద్రత, సౌకర్యం, మంచి రాబడి ఉన్న పథకాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పదవీవిరమణ సమయానికి ఎంతో కొంత వెనకేసుకుందామనే భావనలో ఉంటున్నారు. అందుకోసం చాలా పథకాలే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్రాముఖ్యమైనది, కేంద్ర ప్రభుత్వం భరోసా కూడా ఉండే పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్ పీఎస్). పథకాన్నిపెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీఏ) నిర్వహిస్తుంది. అయితే దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌పీఎస్‌ స్కీమ్‌ ద్వారా ఆకర్షణీయమైన మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లను అందిస్తుంది. ఖాతాదారులకు ట్యాక్స్‌ సేవింగ్‌ ఆప్షన్‌లు కూడా అందిస్తుంది. ఎస్‌బీఐలో ఎన్‌పీఎస్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే లభించే ట్యాక్స్‌ బెనిఫిట్స్‌, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు రకాల ఖాతాలు..

ఎస్ బీఐలో రెండు రకాల నేషనల్ పెన్షన్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి టైర్ 1. ఇది పెన్షన్ అకౌంట్. దీనిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండోది టైర్ 2 అకౌంట్. ఇది ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్, ఇది ఆప్షనల్. టైర్ 1 ఖాతా తీసుకునేందుకు కనీసం మొత్తం రూ.500 గా ఉండగా, టైర్ 2 అకౌంట్ తీసుకునేందుకు కనీసం మొత్తం రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, టైర్ 1 అకౌంట్‌పై ట్యాక్స్ బెనిఫిట్స్ అందుబాటులో ఉండగా.. టైర్ 2 ఖాతాలపై అలాంటి పన్ను రాయితీలు ఉండవు. కానీ, ఏ సమయంలోనైనా ఖాతా నిధి నుంచి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

అర్హతలు, పన్ను ప్రయోజనాలు ఇలా..

ఖతాదారుడు కచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి. ప్రవాస భారతీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరిగా 18-70 సంవత్సరాల వయసులోపు ఉండాలి. ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి.. ఎన్పీఎస్ టైర్ I అకౌంట్‌ ఆదాయ పన్ను చట్టం 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 కాంట్రిబ్యూషన్‌పై ట్యాక్స్‌ డిడక్షన్‌ అందిస్తుంది. సబ్‌స్క్రైబర్‌లు మొత్తం రూ.1.50 లక్షల పరిమితిలోపు పెట్టుబడులకు (బేసిక్ & డియర్‌నెస్ అలవెన్స్‌లో 10 శాతం) 80సీసీఈ కింద పన్ను రాయితీని కూడా పొందవచ్చు. అలాగే 80సీసీడీ (2) కింద జీతంలో 10 శాతం(బేసిక్‌+ డీఏ) వరకు ట్యాక్స్‌ బెనిఫిట్‌ అందిస్తుంది. ద్రవ్య పరిమితి రూ. 7.5 లక్షలకు లోబడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎలా ఎగ్జిట్‌ అవ్వాలి?

  • అకౌంట్‌ ఐదేళ్ల పీరియడ్‌ పూర్తయిన తర్వాత.. కార్పస్‌లో ఇరవై శాతం మొత్తాన్ని ఏకమొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. మొత్తం కార్పస్ రూ.2.50 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, అప్పుడు పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • ఖాతాదారుడు 60 సంవత్సరాల వయస్సుకు చేరుకుంటే: కార్పస్‌లో కనీసం 40 శాతం తప్పనిసరిగా యాన్యుటీ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. మిగిలిన మొత్తాన్ని 75 సంవత్సరాల వయస్సు వరకు భాగాలు/మొత్తంలో ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తానికి ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ఉంటాయి. మొత్తం కార్పస్ రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..