Old Notes – RBI Alert: ఆన్‌లైన్‌లో పాత కరెన్సీ నోట్లు..నాణేల వ్యాపారం.. ఆర్బీఐ కీలక ప్రకటన
RBI Alert: ఇటీవల కాలంలో పాత కరెన్సీ నోట్లు.. నాణేలు కొనుగోలు చేస్తామని చెప్పుకుంటూ చాలా వెబ్ సైట్ లు కనిపిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్ లలో పాత నోట్లకు..న నాణేలకు అధిక ధర చెల్లిస్తామని ప్రచారం చేస్తున్నారు.
Old Notes and Coins Business: ఇటీవల కాలంలో పాత కరెన్సీ నోట్లు.. నాణేలు కొనుగోలు చేస్తామని చెప్పుకుంటూ చాలా వెబ్ సైట్ లు కనిపిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్ లలో పాత నోట్లకు..న నాణేలకు అధిక ధర చెల్లిస్తామని ప్రచారం చేస్తున్నారు. కొన్ని సైట్లు ఏకంగా తమకు ఆర్బీఐ అనుమతి ఉందన్నట్టుగా కూడా ప్రచారం చేసుకుంటున్నాయి. దీంతో చాలామంది ఈ ప్రచారాన్ని నమ్మి మోసపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్ ప్రచారంతో ప్రజలు మోసపోతున్న ఘటనల్ని చూసిన ఆర్బీఐ దీనికి చెక్ చెప్పడానికి రంగంలోకి దిగింది. అందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత నోట్లు, నాణేల ఆన్‌లైన్ అమ్మకం, కొనుగోలు గురించి హెచ్చరిక జారీ చేసింది.
”రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు/ లోగోను కొన్ని ఆన్‌లైన్ సంస్థలు మోసపూరితంగా ఉపయోగిస్తున్నాయని, పాత నోట్లు, నాణేల కొనుగోలు మరియు విక్రయాలకు సంబంధించిన లావాదేవీలలో ప్రజల నుండి ఛార్జీలు/ కమీషన్/ పన్నును కోరుతున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది.” అంటూ వివిధ ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇచ్చిన ప్రకటనలో ఆర్బీఐ పేర్కొంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి విషయాలలో ఆసక్తి చూపించాడనీ అదేవిధంగా, ఏ విధమైన ఛార్జీలు/ కమీషన్లను ఎప్పుడూ కోరదని స్పష్టం చేసింది. అటువంటి లావాదేవీలలో దాని తరపున ఛార్జీలు/ కమిషన్ వసూలు చేయడానికి ఆర్‌బిఐ ఏ సంస్థ/ సంస్థ/ వ్యక్తి మొదలైన వాటికి అధికారం ఇవ్వలేదని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అలాంటి కల్పిత/ మోసపూరిత ఆఫర్ల ద్వారా డబ్బును సేకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును ఉపయోగించుకునే అంశాలలో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించింది.
రిజర్వ్ బ్యాంక్ చెబుతున్న దానిప్రకారం బ్యాంక్ ఎటువంటి పాత నోట్లు, నాణేల వ్యాపారం చేయదు. అందువల్ల ఆర్బీఐ పేరు చెప్పి చార్జీలు కోరే వెబ్‌సైట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
RBI says…… https://t.co/GkYacx40ub pic.twitter.com/3rBe9k5ZWB
— RBI Says (@RBIsays) August 4, 2021
Also Read: Tesla Car: టెస్లా కారుకు బ్రేక్..దిగుమతి సుంకం తగ్గింపు వినతిపై తేల్చేసిన కేంద్రం!