AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tesla Car: టెస్లా కారుకు బ్రేక్..దిగుమతి సుంకం తగ్గింపు వినతిపై తేల్చేసిన కేంద్రం!

మనదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కారు కొనాలని భావించే వారికీ నిరాశకలిగించే విషయం ఇది. టెస్లా కంపెనీ కోరినట్టు దిగుమతి సుంకంపై రాయితీ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించలేదు.

Tesla Car: టెస్లా కారుకు బ్రేక్..దిగుమతి సుంకం తగ్గింపు వినతిపై తేల్చేసిన కేంద్రం!
Tesla Car
KVD Varma
|

Updated on: Aug 04, 2021 | 5:03 PM

Share

Tesla Car: మనదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కారు కొనాలని భావించే వారికీ నిరాశకలిగించే విషయం ఇది. టెస్లా కంపెనీ కోరినట్టు దిగుమతి సుంకంపై రాయితీ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. ఎలక్ట్రిక్ కార్లను బయటి నుంచి తెచ్చి విక్రయిస్తే, దిగుమతి సుంకంలో ఎలాంటి మినహాయింపు లభించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెస్లా కార్లు చాలా ఖరీదైనవి. ఈ కార్ల మోడల్స్ లో ఒక్కటి మినహా మిగిలినవి అన్నీ ఇండియాలో దిగుమతి చేసుకుంటే నూరుశాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. అమెరికా మార్కెట్ లో ఉన్నధరకు సమానంగా సుంకం ఉంటుంది.

ఒక్క కారే కాస్త చీప్..

టెస్లా చౌకైన కారు మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్. దీని ధర 40,000 డాలర్ల కంటే తక్కువ. దీన్ని దిగుమతి చేయడం వల్ల దిగుమతి సుంకం 60%ఉంటుంది. ఈ కారు మినహా మిగిలిన టెస్లా కార్లన్నీ 60 వేల డాలర్ల కంటే పైనే ఉంటాయి. వాటిని దిగుమతి చేసుకోవాలంటే నూరుశాతం సుంకం చెల్లించాలి. టెస్లా గత నెలలో ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలను 40%కు తగ్గించాలని కోరుతూ రవాణా, పరిశ్రమల మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది. కానీ ప్రభుత్వం ఆ అభ్యర్ధనను తిరస్కరించినట్టు చెబుతున్నారు. దీంతో టెస్లా కారు ఇక్కడ కొనుక్కోవాలంటే ఎక్కువ ఖరీదు పెట్టాల్సి వస్తుంది.

దిగుమతి సుంకం వదులుకోలేదు – ప్రభుత్వం

ప్రభుత్వం దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని మినహాయించే లేదా తగ్గించే ఉద్దేశం లేదని చెప్పింది. టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ ఒక వారం క్రితం కంపెనీ తన కార్లను భారతదేశంలో విడుదల చేయాలనుకుంటున్నారని, అయితే ఇక్కడ దిగుమతి సుంకం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు.

స్వదేశీ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది

విద్యుత్, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కిషన్ పాల్ గుర్జార్ పార్లమెంటులో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించే ప్రతిపాదనను తమ మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. స్థానికంగా ఎలక్ట్రిక్ వాహనాలపై తక్కువ పన్ను విధించడం, వాటి ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడం ద్వారా వాటిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గుర్జార్ చెప్పారు.

దిగుమతి సుంకం 60 నుండి 100%

కానీ, దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ప్రతిఒక్కరూ పోటీలో సమాన అవకాశాన్ని పొందాలని నమ్ముతారు. యుఎస్ తర్వాత చైనా టెస్లాకు  అతిపెద్ద మార్కెట్. కానీ, కొంత కాలంగా ఇది చైనాలో కఠినమైన స్థానిక ప్రభుత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ప్ర కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టెస్లా ఇక్కడ కూడా తన కార్ల అమ్మకాలు ప్రారంభించాలని భావిస్తోంది. కానీ,  కొత్త కార్లపై 60 నుండి 100% దిగుమతి సుంకం ఆ కంపెనీకి అడ్డుపడుతోంది.

డీజిల్-పెట్రోల్ వాహనాల లాంటి చికిత్స

టెస్లా సీఈవో మాస్క్ ..జూలై 24 న,  ఒక వినియోగదారుడు చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా, భారతదేశంలో పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలను కూడా డీజిల్, పెట్రోల్ వాహనాల లానే చూస్తున్నట్టు చెప్పారు. ఈ విధానం వాతావరణ మార్పును ఎదుర్కోవాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా లేదు అని వ్యాఖ్యానించారు. ఇతర విదేశీ ఆటోమొబైల్ కంపెనీల సీఈవోలు కూడా మస్క్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.

ఫ్యాక్టరీ తర్వాత ఏర్పాటు చేయవచ్చు

మరొక వినియోగదారు ట్వీట్ చేసి, టెస్లా కార్లను భారతదేశంలో దిగుమతి చేయడం ద్వారా అమ్మకాలను ప్రారంభిస్తారా? అని అడిగారు. దీనికి, ప్రస్తుతానికి దిగుమతి సుంకంలో తాత్కాలిక ఉపశమనాన్ని ఆశిస్తున్నట్లు మస్క్ చెప్పారు. దిగుమతి చేసుకున్న కార్లతో కంపెనీ తన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోగలిగితే,  భారతదేశంలో ఒక ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయగలమని ఆయన చెప్పారు.

Also Read: Multibagger 2021: బ్యాంక్ FD లేదా RD లో కాదు.. ఇక్కడ 4 నెలల్లో లక్ష రూపాయలు.. రూ.12 లక్షలుగా మారింది.. గోల్డెన్ ఛాన్స్..

RBI: బ్యాంకింగ్‌ మోసాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కొత్త నిబంధనలు..!