AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renault cars: సొంత కారు కలను నెరవేర్చేలా రెనాల్ట్ సూపర్ కార్లు.. రూ.6.1 లక్షలకే రెండు కార్ల విడుదల

తక్కువ ధరలో మంచి ఫ్యామిలీ కారు కొనుగోలు చేయాలని మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఉన్న బడ్జెట్ లో మెరుగైన కారు తీసుకోవాలని భావిస్తారు. ఇలాంటి వారందరికీ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్డ్ ఇండియా శుభవార్త చెప్పింది. 2025 ట్రైబర్ (triber), కిగర్ (kiger) అనే పేర్లతో రెండు కార్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటి ధర రూ.6.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ పేరుతో పాత మోడళ్లు ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిని అప్ డేట్ చేసి, ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా మార్పులు చేసి కొత్త మోడళ్లను రెనాల్ట్ ఆవిష్కరించింది.

Renault cars: సొంత కారు కలను నెరవేర్చేలా రెనాల్ట్ సూపర్ కార్లు.. రూ.6.1 లక్షలకే రెండు కార్ల విడుదల
Renault Kiger
Nikhil
|

Updated on: Feb 20, 2025 | 3:48 PM

Share

మన దేశ మార్కెట్ లో రెనాల్ట్ కంపెనీ కార్లకు మంచి ఆదరణ ఉంది. వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడతారు. కస్టమర్ల అవసరాలను అనుగుణంగా, ఆధునిక టెక్నాలజీ, ఫీచర్లతో ఈ కంపెనీ కార్లను విడుదల చేస్తుంది. దీంతో మార్కెట్ లో మంచి వాటాను కూడా సంపాదించింది. ఈ నేపథ్యంలో ప్రజాదరణ పొందిన పాత మోడళ్లను అప్ డేట్ చేసి, ఇప్పుడు విడుదల చేసింది. ఈ-20 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్లలో మార్పులు చేశారు. వీటిలో ప్రామాణిక పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. 8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కొన్ని ట్రిమ్ లకు ఆండ్రాయిడ్ ఆటో / ఆపిల్ కార్ ప్లే అమర్చారు. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లూ పవర్ ట్రెయిన్ ఎంపికలను నిలుపుకొంటూ, మెరుగైన ఫీచర్లతో వచ్చాయి.

రెనాల్డ్ కిగర్ మోడల్ కారు ఆర్ఎక్స్ ఈ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్టీ (ఓ), ఆర్ఎక్స్ జెడ్ అనే నాలుగు రకాల ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్లలో నాలుగు పవర్ విండోలు, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఏర్పాటు చేశారు. ఆర్ఎక్స్ ఎల్ వేరియంట్ లో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ ప్లే, రివర్స్ పార్కింగ్ కెమెరా, స్టీరింగ్ – మౌంటెడ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. వీటిలోని టాప్ ఎండ్ వేరియంట్ అయిన్ ఆర్ఎక్స్ ఎల్ ట్రిమ్ లో రిమోట్ ఇంజిన్ స్టార్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రోనాల్ట్ కిగర్ కారులో రెండు రకాల పెట్రోలు ఇంజిన్ల ఎంపికల్లో అందుబాటులోకి వచ్చింది. 1.0 లీటర్ పెట్రోల్ మోటార్ ఇంజిన్ నుంచి 72 హెచ్ పీ, 96 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. అలాగే 1.0 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ నుంచి 100 హెచ్ పీ, 160 ఎన్ఎం గరిష్ట టార్కు ఉత్పత్తి జరుగుతుంది. పాత ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ తో లభిస్తుంది. టర్బో చార్జ్డ్ ఇంజిన్ లో 5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆప్షన్ ఏర్పాటు చేశారు. కొత్తగా రెనాల్డ్ ఆర్ఎక్స్టీ (0) ట్రిమ్ లో టర్బో సీవీటీ తో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మోడల్ రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) ధరకు లభిస్తోంది.

రెనాల్ట్ ట్రైబర్ మోడల్ కారు ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ ఎల్, ఆర్ఎక్స్టీ, ఆర్ఎక్స్ జెడ్ అనే నాలుగు రకాల ట్రిమ్ లలో లభిస్తుంది. వీటిలో ఆర్ఎక్స్ఎల్ ట్రిమ్ ను 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిట్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, రియర్ వ్యూ కెమెరా, రియర్ పవర్ విండోస్, రియర్ స్పీకర్లతో అప్ గ్రేట్ చేశారు. అలాగే ఆర్ఎక్స్టీ ట్రిమ్ లో 15 అంగుళాల ఫ్లెక్స్ వీల్స్ అమర్చారు. ఇక ట్రైబర్ కారులో 1.0 లీటర్ పెట్రోలు ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 72 హెచ్పీ, 96 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ట్రాన్స్ మిషన్ ఎంపికలకు సంబంధించి 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి