AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto News: ఈ కారుకు ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే ఏకంగా 1000కి.మీ రేంజ్‌..! ట్యాంకు కెపాసిటీ ఎంతో తెలుసా?

Auto News: మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదల అవుతున్నాయి. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు (36 kW e-మోటార్, 15 kW హై-వోల్టేజ్ స్టార్టర్ జనరేటర్), 1.8-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ (80 kW లేదా 109 hp), కొత్త ఇంటెలిజెంట్ మల్టీ-మోడ్..

Auto News: ఈ కారుకు ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే ఏకంగా 1000కి.మీ రేంజ్‌..! ట్యాంకు కెపాసిటీ ఎంతో తెలుసా?
Renault Duster Suv
Subhash Goud
|

Updated on: Feb 04, 2026 | 7:16 PM

Share

Renault Duster SUV: ప్రపంచ మార్కెట్లో సరికొత్త కార్లు విడుదల అవుతున్నాయి. కానీ చాలా కార్ కంపెనీలు ఇప్పటికీ హైబ్రిడ్ టెక్నాలజీపై పని చేస్తున్నాయి. టయోటా, సుజుకి తర్వాత ఫ్రెంచ్ మేజర్ రెనాల్ట్ కూడా భారతదేశంలో హైబ్రిడ్ టెక్నాలజీపై ఆధారపడుతోంది. ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త డస్టర్ SUV బలమైన హైబ్రిడ్ వేరియంట్‌ను అందించే రెనాల్ట్ మొదటి కారు అవుతుంది.

మీడియా నివేదికల ప్రకారం.. హైబ్రిడ్ డస్టర్ ఒకే ఫుల్ ట్యాంక్‌తో దాదాపు 1,000 కిలోమీటర్లు ప్రయాణించగలదని తెలుస్తోంది. డస్టర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం. దాదాపు 50 లీటర్లు. కొత్త డస్టర్ హైబ్రిడ్‌ను ఈ సంవత్సరం దీపావళి నాటికి భారతదేశంలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. యూరప్‌లో అందుబాటులో ఉన్న E-Tech 160 పవర్‌ట్రెయిన్ సిరీస్-ప్యారలల్ హైబ్రిడ్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు (36 kW e-మోటార్, 15 kW హై-వోల్టేజ్ స్టార్టర్ జనరేటర్), 1.8-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ (80 kW లేదా 109 hp), కొత్త ఇంటెలిజెంట్ మల్టీ-మోడ్ క్లచ్‌లెస్ గేర్‌బాక్స్, 1.4 kWh బ్యాటరీ ఉన్నాయి. భారతదేశం కోసం ఈ పవర్‌ట్రెయిన్ తక్కువ ఆర్‌పీఎం వద్ద అధిక టార్క్‌ను అందిస్తుంది. అలాగే భారతీయ రోడ్ల కోసం ట్యూన్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: హోలీ, దీపావళి నాడు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇవి కూడా చదవండి

ఒక కారు 1 లీటరులో ఎంత ?

యూరప్‌లో E-Tech 160 ఫుల్ హైబ్రిడ్ వాహనం దాదాపు 25 కిమీ/లీటర్‌గా నివేదించింది. హైబ్రిడ్ డస్టర్ మారుతి వ్యాగన్ఆర్ పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే మంచి మైలేజీని అందిస్తుంది.

డీజిల్ మోడళ్లకు హైబ్రిడ్ ఎంపిక:

కొత్త డస్టర్ మూడు పెట్రోల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందిస్తోంది. టర్బో TCe 160, స్ట్రాంగ్ హైబ్రిడ్ E-టెక్ 160, టర్బో TCe 100. డీజిల్ వేరియంట్ ఉండదు. గతంలో డీజిల్ వేరియంట్ డస్టర్ అమ్మకాలలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

ఇది కూడా చదవండి: Cash Transaction Rule: ఇంతకు మించి నగదు లావాదేవీలు జరుపుతున్నారా? భారీ పెనాల్టీ తప్పదు!

ఇది కూడా చదవండి: FasTag Rule Change: వాహనదారులకు గుడ్‌న్యూస్.. కొత్త ఫాస్టాగ్‌ నియమాలు.. నేటి నుంచి అమలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి