Reliance Jio: రిలయన్స్ జియో కీలక నిర్ణయం.. గడువు కంటే ముందుగానే ప్రభుత్వానికి రూ.30,791 కోట్లు చెల్లింపు
Reliance Jio: రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్‌కు చెల్లించాల్సిన రూ.30,791 కోట్లనను గడువుకు..
Reliance Jio: రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్‌కు చెల్లించాల్సిన రూ.30,791 కోట్లనను గడువుకు ముందుగానే చెల్లించినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) ఒక ప్రకటనలో తెలిపింది. 2014, 2015, 2016 వేలం ద్వారా 2021 లో ట్రేడింగ్ ద్వారా దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు సంబంధించిన మొత్తాన్ని చెల్లించింది. అయితే ఎయిర్‌టెల్‌తో కలిసి ఈ స్పెక్ట్రమ్‌ను వాడుకునే హక్కు పొందింది. అయితే వాయిదా వేసిన ఈ చెల్లింపును ముందుగానే చెల్లించింది. వేలం ద్వారా, ట్రేడింగ్ ద్వారా రిలయన్స్ జియో మొత్తం 585.3 MHz స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.
కాగా, రిలయన్స్ 2016 సంవత్సరంలో వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు సంబంధించి 2021 అక్టోబర్ నెలలో వార్షికోత్సవ తేదీన మొదటి విడత ముందస్తు చెల్లింపును చేసింది. ఆ తర్వాత టెలికామ్ కంపెనీలు బకాయిపడ్డ స్పెక్ట్రమ్ చెల్లింపుల్ని ముందస్తుగా చెల్లించింది. డిసెంబర్ 2021 నెలలో టెలికాం డిపార్ట్‌మెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. టెలికాం కంపెనీలు వాయిదాపడిన స్పెక్ట్రమ్ లియబిలిటీస్ ఏ తేదీలోనైనా ముందస్తుగా చెల్లించే సౌలభ్యాన్ని అందించాయి. రిలయన్స్ ఇప్పుడు జనవరి 2022 నెలలో ముందస్తు చెల్లింపు చేసింది, అయితే 2014 సంవత్సరంలో వేలంలో పొందిన మొత్తం అలాగే 2015 ట్రేడింగ్ ద్వారా పొందిన స్పెక్ట్రమ్ వాయిదా పడింది.
రూ.1,200 కోట్ల వడ్డీ ఆదా
2022-23 ఆర్థిక సంవత్సరం నుండి 2034-2035 వరకు వార్షిక వాయిదాలలో చెల్లించబడ్డాయి. ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధితో 9.30 శాతం నుండి 10 శాతం మధ్య వడ్డీ రేటును కలిగి ఉంది. ముందస్తు చెల్లింపుల వల్ల ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం సంవత్సరానికి రూ.1,200 కోట్ల వడ్డీ ఆదా అవుతుందని కంపెనీ అంచనా వేసింది . భారతీ ఎయిర్‌టెల్ గత నెలలో టెలికాం డిపార్ట్‌మెంట్‌కి రూ.15,519 కోట్లను చెల్లించి, 2014 సంవత్సరం వేలంలో పొందిన స్పెక్ట్రమ్‌కు సంబంధించిన మొత్తం వాయిదా పడిన లియబిలిటీస్ ముందస్తుగా చెల్లించింది.
ఇవి కూడా చదవండి: