Reliance Jio new Recharge Plan: కస్టమర్లకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్.. రూ. 444తో కొత్త రీచార్జ్ ప్లాన్
Reliance Jio new Recharge Plan: రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఎప్పటిక్పుడు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా మరో కొత్త రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది....
Reliance Jio new Recharge Plan: రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఎప్పటిక్పుడు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా మరో కొత్త రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. దేశ వ్యాప్తంగా జియో కస్టమర్ల కోసం సరసమైన ధరకే ఈ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ. 444 రీచార్జ్ ప్లాన్ కింద రోజుకు 2GB డేటా పొందే అవకాశం ఉంటుంది. ఇతర టెలికం కంపెనీదారులకంటే తక్కువగా ఈ ప్లాన్ అందజేస్తున్నామని జియో తెలిపింది.
జియో యూజర్లు ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే రోజుకు 2GB డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. అలాగే డెయిలీ జియో యాప్స్ యాక్సస్ కూడా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త రూ.444 ప్లాన్ గడువు 56 రోజులు ఉంటుంది. అయితే రోజుకు 2జీబీ డేటా చొప్పున 56 రోజులు పొందవచ్చు. మొత్తం 112జీబీ డేటా లిమిట్ దాటితే యూజర్లకు ఇంటర్నెట్ స్పీడ్ 64kbps మాత్రమే వస్తుందని పేర్కొంది. జియో కస్టమర్లు ఇతర నెట్ వర్కులకు కూడా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్ చేసుకోవచ్చు.