NITI innovation index: నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ – 2020 జాబితా విడుదల.. మరోసారి నాలుగో స్థానంలో తెలంగాణ

ప్రపంచ ఆవిష్కరణల సూచీ తరహాలో రూపొందించిన ఈ సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది.

  • Balaraju Goud
  • Publish Date - 6:45 pm, Wed, 20 January 21
NITI innovation index: నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ - 2020 జాబితా విడుదల.. మరోసారి నాలుగో స్థానంలో తెలంగాణ

రెండవ ఇన్నోవేషన్ ఇండెక్స్ జాబితాలోనూ మరోసారి తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. బుధవారం విడుదలైన నీతి ఆయోగ్ రెండో ఇన్నోవేషన్ ఇండెక్స్ – 2020లో కర్ణాటక మొదటి స్థానం దక్కించుకోగా, ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ ఆవిష్కరణలలో మొదటి ఐదు రాష్ట్రాలు నిలిచాయి. ప్రపంచ ఆవిష్కరణల సూచీ తరహాలో రూపొందించిన ఈ సూచీని ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్ విడుదల విడుదల చేశారు. ఈ జాభితా లో జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.

దేశ ప్రగతిలో నూతన ఆవిష్కరణల పాత్రను తెలిపే ఇన్నోవేషన్ ఇండెక్స్‌‌ను నీతి ఆయోగ్‌ ప్రతి ఏటా విడుదల చేస్తోంది. ఈ ఇండెక్స్‌లో గతేడాదిలాగే మళ్లీ కర్ణాటకే తొలి ర్యాంక్‌లో నిలిచింది. తెలంగాణ నాలుగో స్థానాన్ని పదిలం చేసుకోగా.. గతేడాదిలో 10 స్థానంలో ఉన్న ఏపీ మరింతగా మెరుగుపడి ఏడో స్థానంలోకి చేరుకుంది.

దేశవ్యాప్తంగా 17 పెద్ద రాష్ట్రాలు, 10 ఈశాన్య రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత, సిటీ స్టేట్స్‌గా విభజించి వాటి పనితీరు ఆధారంగా ఈ ఇండెక్స్‌ను నీతి ఆయోగ్ రూపొందించింది. ఇక మిగిలిన స్థానాల్లో హర్యానా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌, యూపీ, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌లు నిలిచాయి. అలాగే, ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి ర్యాంక్‌లో నిలవగా.. కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సాహించడంలో ఆయా రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు, తమ బలాలతో పాటు లోటుపాట్లను సరిచేసుకొని కొత్త ఆవిష్కరణల దిశగా వెళ్లడం తదితర అంశాల్లో వచ్చిన సగటు స్కోరు ఆధారంగా ఈ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ను రూపొందించారు.