Facebook: కీలక నిర్ణయం తీసుకున్న ‘ఫేస్బుక్’.. ఇకనుంచి ఆ ఆప్షన్ కనిపించదు.. రీడిజైన్ చేయనున్న..
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ పేజీలను కొత్తగా రీడిజైన్ చేయడానికి సన్నాహాలు
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ పేజీలను కొత్తగా రీడిజైన్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంటే ఇప్పటివరకు పబ్లిక్ పేజీల్లో ఉన్న లైక్ బటన్‌ను తొలగించనుంది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియా కంపెనీ ఓ ప్రకటనలో పేర్కోంది.
ఫేస్బుక్ పబ్లిక్ పేజీలను రీడిజైన్ చేయనుంది. న్యూస్ ఫీడ్‌లో మరిన్ని కన్వర్షన్లు పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఆర్టిస్టులు, పబ్లిక్ ఫిగర్స్, బ్రాండ్స్ పబ్లిక్ పేజీల్లో ఇక నుంచి లైక్ బటన్ కనిపించనుంది. దీంతో ఇక ఫేస్బుక్ పైజీల్లో ఫాలోవర్లు మాత్రమే కనిపిస్తారని తెలిపింది. ఇక ఈ కొత్త రీడైజన్ను జనవరిలోనే ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్టులో తెలిపింది. ఇప్పటివరకు లైక్ బటన్, ఫాలోవర్స్ బటన్ వేర్వేరుగా ఉండడంటో యూజర్లకు కన్ఫ్యూజన్గా ఉండేది. తాజాగా ఫేస్బుక్ తీసుకువస్తున్న ఈ రీడిజైన్‌తో అందుకు చెక్ పెటనున్నట్లుగా తెలుస్తోంది.
Also Read:
What’s App: సిగ్నల్ యాప్‌కు మారుతున్నారా ? అయితే మీ వాట్సప్ గ్రూపులను మార్చుకోండిలా..