Jio: అంబానీయా మజాకా.. దిమ్మతిరిగే ఆఫర్.. కస్టమర్లకు ఇది కదా కావాల్సింది

జియోభారత్ V3, V4 ఫోన్‌లలో 4G ఎనేబుల్ చేయబడింది. ధర రూ.1,099గా నిర్ణయించబడింది. ప్రత్యేకంగా, నెలవారీ రీఛార్జ్ ప్లాన్ రూ. 123 మాత్రమే. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, 14GB డేటాను కూడా అందిస్తుంది.

Jio: అంబానీయా మజాకా.. దిమ్మతిరిగే ఆఫర్.. కస్టమర్లకు ఇది కదా కావాల్సింది
Reliance Jio Bharat
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 15, 2024 | 6:39 PM

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్న రిలయన్స్‌ జియో రెండు కొత్త ఫీచర్‌ ఫోన్‌లను తాజాగా విడుదల చేసింది. JioBharat సిరీస్‌లోని Jio V3, V4 మోడల్స్‌ను ఆవిష్కరించింది. ఈ 4G టెక్నాలజీ ఎనేబుల్డ్ ఫోన్ ధర కేవలం రూ.1,099 మాత్రమే. అంతేకాకుండా దీని నెలవారీ రీఛార్జ్ రేటు రూ. 123గా సంస్థ నిర్ణయించింది. జియో భారత్ వి2 ఫోన్ గతేడాది లాంచ్ కాగా.. దానికి కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే జియో ఆ సిరీస్‌ నుంచి మరో రెండు కొత్త ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

V3, V4 జియోభారత్ ఫీచర్ ఫోన్‌లు అయినప్పటికీ, స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఇందులోనూ ఉన్నాయి. UPI చెల్లింపులు, లైవ్ టివీ, JioTV, JioPay, Jio Cinema మొదలైన యాప్‌లను ఈ జియో భారత్ లేటెస్ట్ వెర్షన్ ఫోన్‌లలో వినియోగించుకోవచ్చు. Jio Bharat V3, V4 ఫోన్‌లలో చాలా ఆకర్షణీయంగా రూపొందించబడింది. ఈ రెండు ఫోన్‌ల బ్యాటరీ 1,000 mAh కాగా.. మెమరీ స్టోరేజీని 128 GB వరకు పెంచుకోవచ్చు. తెలుగుతో సహా 23 భారతీయ భాషలలో ఫోన్ ఇంటర్‌ఫేస్‌ను తయారు చేశారు.

నెలవారీ రీఛార్జ్ రూ. 123 మాత్రమే..

జియోభారత్ V3, V4 ఫోన్‌లలో 4G ఎనేబుల్ చేయబడింది. వీటి ధరను రూ.1,099గా నిర్ణయించారు. ప్రత్యేకంగా, నెలవారీ రీఛార్జ్ ప్లాన్ రూ. 123 మాత్రమే లభిస్తోంది. ఈ ప్లాన్‌తో అపరిమిత కాలింగ్, 14GB డేటా లభిస్తుంది. ఈ రూ. 123 రీచార్జ్ ప్లాన్.. ఇతర టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్ కంటే చాలా చౌకగా అందిస్తోంది రిలయన్స్ జియో. కాగా, JioBharat V3, V4 ఫోన్‌లు Jiomart, Amazon వెబ్ సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, మొబైల్ షాపుల్లో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..