Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Tvs Supply: తగ్గిన స్మార్ట్‌ టీవీల సరఫరా.. కారణం ఏంటో తెలుసా..?

కంపెనీల నుంచి స్మార్ట్‌ టీవీల సరఫరాలు, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, ఈ ఏడాది జనవరి-మార్చిలో 14% తగ్గాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. వినియోగదారు గిరాకీ పెద్దగా ఉండకపోవడమే ఇందుకు కారణామని వెల్లడించింది. అలాగే ఇప్పటికే డీలర్ల వద్ద స్టాక్స్‌ అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. అలాగే ఏడాదిలో టీవీల సరఫరాల్లో 10% మేర తగ్గిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. త్రైమాసికంలో చైనా కంపెనీ షియోమీని తోసిరాజని, శామ్‌సంగ్‌ మళ్లీ అగ్ర స్థానానికి […]

Smart Tvs Supply: తగ్గిన స్మార్ట్‌ టీవీల సరఫరా.. కారణం ఏంటో తెలుసా..?
Smart Tv
Follow us
Subhash Goud

|

Updated on: Jun 09, 2024 | 9:55 AM

కంపెనీల నుంచి స్మార్ట్‌ టీవీల సరఫరాలు, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, ఈ ఏడాది జనవరి-మార్చిలో 14% తగ్గాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. వినియోగదారు గిరాకీ పెద్దగా ఉండకపోవడమే ఇందుకు కారణామని వెల్లడించింది. అలాగే ఇప్పటికే డీలర్ల వద్ద స్టాక్స్‌ అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. అలాగే ఏడాదిలో టీవీల సరఫరాల్లో 10% మేర తగ్గిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. త్రైమాసికంలో చైనా కంపెనీ షియోమీని తోసిరాజని, శామ్‌సంగ్‌ మళ్లీ అగ్ర స్థానానికి చేరింది. చైనా బ్రాండ్ల స్మార్ట్‌ టీవీల సరఫరాలు 30% వరకు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. వన్‌ప్లస్, హైయర్, రియల్‌మీ బ్రాండ్ల స్మార్ట్‌ టీవీలు బాగా తగ్గాయని కూడా తెలిపింది.

శామ్‌సంగ్‌ టీవీల సరఫరా 40 శాతం తగ్గింపు

ఇదిలా ఉండగా, నివేదికల ప్రకారం.. శామ్‌సంగ్‌ టీవీ సరఫరా భారీగానే తగ్గింది. 40 శాతం వరకు తగ్గినట్లు వెల్లడించింది. భారతీయ కంపెనీల స్మార్ట్‌ టీవీల సరఫరాలు 16 శాతంగా ఉండగా, దక్షిణ కొరియా కంపెనీ ఎల్‌జీ సరఫరాలు 43% ఉన్నాయి. మన దేశంలో స్మార్ట్‌ టీవీ మార్కెట్లో ఎల్‌జీకి 15% మార్కెట్‌ వాటా ఉంది. చైనా బ్రాండ్లు ఎంఐ 2 శాతం, అలాగే టీసీఎల్‌ కంపెనీల సరఫరాలు 4శాతం మేర క్షీణించినట్లు తెలుస్తోంది. మన విపణిలో వీటి వాటా వరుసగా 12%, 7 శాతంగా ఉంది. సోనీ కంపెనీ సరఫరాలు 19% వృద్ధిని నమోదు చేయగా, దేశీయంగా ఈ కంపెనీకి 7% వాటా ఉంది.

శామ్‌సంగ్, ఎల్‌జీ, షియోమీ బ్రాండ్ల స్మార్ట్‌ టీవీలకు గిరాకీ బాగుంది. టాప్‌-5 కంపెనీల వాటా 2024 తొలి త్రైమాసికంలో 57 శాతానికి చేరింది. 2023 ఇదే సమయంలో ఇది 41 శాతంగానే నమోదైందని రీసెర్చ్‌ అనలిస్ట్‌ ఆకాశ్‌ జత్వాలా వెల్లడించారు. హైసెన్స్, పానసోనిక్, వెస్టెల్, తోషిబా, మోటోరోలా వంటివి వృద్ధి నమోదు చేశాయని, ఇవి క్యూఎల్‌ఈడీ టీవీలను 4కే రెజొల్యూషన్‌తో తక్కువత ధరకే అందిస్తున్నాయని పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
చాణక్యనీతి : జాగ్రత్త.. ఈ నలుగురు వ్యక్తులకు అప్పు ఇవ్వకూడదంట!
చాణక్యనీతి : జాగ్రత్త.. ఈ నలుగురు వ్యక్తులకు అప్పు ఇవ్వకూడదంట!
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌
తెలుగు తెరపై కాంతార బ్యూటీ..ఈ అమ్మడుకు లక్కు కలిసొస్తుందా?
తెలుగు తెరపై కాంతార బ్యూటీ..ఈ అమ్మడుకు లక్కు కలిసొస్తుందా?
అలసటను తగ్గించే ఐదు అద్భుతమైన యోగాసనాలు ఇవే !
అలసటను తగ్గించే ఐదు అద్భుతమైన యోగాసనాలు ఇవే !