Realestate: రియల్ ఎస్టేట్ దిగ్గజాల్లో టాప్ 100లో 10మంది తెలుగోళ్లే

రియల్ ఎస్టేట్ రంగంలో తెలుగు రాష్ట్రాల హవా గట్టిగానే ఉంది. దేశంలోని 100 మంది సంపన్న రియాల్టీ దిగ్గజాల్లో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. 2023కి గాను దేశీ రియల్టీ కుబేరులతో కిచెన్, బాత్రూమ్‌ ఫిట్టింగ్స్‌ సంస్థ గ్రోహె, రీసెర్చ్‌ సంస్థ హురున్‌..

Realestate: రియల్ ఎస్టేట్ దిగ్గజాల్లో టాప్ 100లో 10మంది తెలుగోళ్లే
Realestate
Follow us

|

Updated on: May 30, 2023 | 1:28 PM

రియల్ ఎస్టేట్ రంగంలో తెలుగు రాష్ట్రాల హవా గట్టిగానే ఉంది. దేశంలోని 100 మంది సంపన్న రియాల్టీ దిగ్గజాల్లో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. 2023కి గాను దేశీ రియల్టీ కుబేరులతో కిచెన్, బాత్రూమ్‌ ఫిట్టింగ్స్‌ సంస్థ గ్రోహె, రీసెర్చ్‌ సంస్థ హురున్‌ ఇండియా సంయుక్తంగా తీసుకువచ్చిన ఒక లిస్ట్ లో ఈ విషయం వెల్లడైంది. రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ రాజీవ్‌ సింగ్‌ అత్యంత సంపన్నుడిగా ఆ లిస్ట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రూ. 59,030 కోట్ల సంపదతో ఆయన మరోసారి నంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. 16 నగరాలకు చెందిన 67 కంపెనీలకు సంబంధించి 100 మంది సంపన్నులకు ర్యాంకింగ్‌ ఇచ్చారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది చోటు దక్కింది.

ఇటీవల విడుదల చేసిన సంపన్నుల జాబితా ప్రకారం.. రూ. 42,270 కోట్ల సంపదతో మంగళ్‌ ప్రభాత్‌ లోధా కుటుంబం రెండో స్థానంలో, రూ. 37,000 కోట్ల సంపదతో ఆర్‌ఎంజెడ్‌ కార్ప్‌ అర్జున్‌ మెండా కుటుంబం మూడో స్థానంలో ఉన్నాయి. ఈసారి లిస్టులో 25 మందికి కొత్తగా చోటు దొరికింది. అదేవిధంగా గతంలో ఈ లిస్టులో ఉన్నవారిలో 36 మంది సంపద తగ్గింది.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే కనుక.. మహారాష్ట్రలో అత్యధికంగా 37 మంది రియల్టీ కుబేరులు ఉన్నారు. అలాగే ఢిల్లీలో 23 మంది, కర్ణాటకంలో 18 మంది ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణాలో 9 మంది, ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కరూ ఈ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. నగరాల పరంగా 29 మందితో ముంబయి అగ్రస్థానంలో ఉండగా ఢిల్లీ.. బెంగళూరు తరువాత స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అలాగే 2017లో టాప్‌ 10లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద రూ.3,350 కోట్లుగా ఉంది. అది ప్రస్తుతం రూ.15,000 కోట్లకు చేరుకుంది. అలాగే టాప్‌ 50లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద రూ. 660 కోట్ల నుంచి రూ.1,330 కోట్లకు చేరింది. టాప్‌ 100 మంది రియాల్టీ దిగ్గజాల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 4% పెరిగి రూ.4,72,330 కోట్లుగా ఉంది. ఇందులో టాప్‌ 10 కుబేరుల వాటా 60%గా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ లిస్టు లో చోటు సంపాదించుకున్న పది మంది వీరే.

గవ్వా అమరేందర్‌ రెడ్డి కుటుంబం, జీఏఆర్‌ రూ.15,000 కోట్లతో 10లో ఉన్నారు. జూపల్లి రామేశ్వర రావు కుటుంబం (మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌) రూ. 9,490 కోట్లతో 13వ ర్యాంకులో ఉన్నారు. సి. వెంకటేశ్వర రెడ్డి, (అపర్ధ) రూ. 5,940 కోట్లతో 16వ ర్యాంకు, ఎస్‌ సుబ్రమణ్యం రెడ్డి (అపర్థ కన్‌స్ట్రక్షన్స్‌) రూ. 5,880 కోట్లతో 17వ ర్యాంకు, మనోజ్‌ నంబూరు (అలయన్స్‌ ఇన్‌ఫ్రా) రూ. 3,900 కోట్లతో 29వ ర్యాంకు, అయోధ్య రామిరెడ్డి (రామ్‌కీ ఎస్టేట్స్‌) రూ. 1,420 కోట్లతో 46వ ర్యాంకు, సునీల్‌ బొమ్మిరెడ్డి (అలయన్స్‌ ఇన్‌ఫ్రా) రూ. 1,300 కోట్లతో 49వ ర్యాంకు, సురేంద్ర బొమ్మిరెడ్డి (అలయన్స్‌ ఇన్‌ఫ్రా) రూ. 1,300 కోట్లతో 49వ ర్యాంకు, సురేశ్‌ బొమ్మిరెడ్డి (అలయన్స్‌ ఇన్‌ఫ్రా) రూ.1,300 కోట్లతో 49వ ర్యాంకు, జీవీకే రెడ్డి, కుటుంబం (తాజ్‌ జీవీకే హోటల్స్‌) రూ. 700 కోట్లతో 78వ ర్యాంకు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!