RBI Web Series: ఆర్బీఐ వెబ్‌ సిరీస్‌.. 90 ఏళ్ల చరిత్రను కేవలం 3 గంటల్లోనే చూడవచ్చు!

దేశంలోని బ్యాంకులన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కింద నిర్వహణ కొనసాగుతాయి. వాటి పనితీరు, 90 సంవత్సరాల ప్రయాణంపై వెబ్ సిరీస్‌ను తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఐదు ఎపిసోడ్‌లుగా ఉంటుంది. ఆర్‌బీఐ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వెబ్ సిరీస్‌ల తయారీ కోసం..

RBI Web Series: ఆర్బీఐ వెబ్‌ సిరీస్‌.. 90 ఏళ్ల చరిత్రను కేవలం 3 గంటల్లోనే చూడవచ్చు!
Rbi
Follow us
Subhash Goud

|

Updated on: Jul 31, 2024 | 11:42 AM

దేశంలోని బ్యాంకులన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కింద నిర్వహణ కొనసాగుతాయి. వాటి పనితీరు, 90 సంవత్సరాల ప్రయాణంపై వెబ్ సిరీస్‌ను తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఐదు ఎపిసోడ్‌లుగా ఉంటుంది. ఆర్‌బీఐ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వెబ్ సిరీస్‌ల తయారీ కోసం ఈ-టెండర్ ద్వారా బిడ్‌లను కోరింది. ఇ-టెండర్ అధికారిక పత్రం ప్రకారం, వెబ్ సిరీస్ దాదాపు 3 గంటల నిడివి ఉంటుంది. ఒక ఎపిసోడ్ వ్యవధిని 25-30 నిమిషాలు ఉంచాలని ప్రతిపాదించబడింది. ఇది టీవీ ఛానెల్ లేదా OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయనుంది.

ఆర్బీఐ వెబ్ సిరీస్‌లో ప్రత్యేకత ఏమిటి?

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌బీఐ స్థాపించి 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. 5 ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో దేశ ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ ముఖ్యమైన పాత్ర గురించి ప్రజలకు అవగాహన పెంచుతుందని ఆర్బీఐ తెలిపింది. ఈ వెబ్ సిరీస్‌లో ఆర్బీఐ విజన్, మిషన్ రెండూ తెలియజేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు ఆగస్టు 31కి పొడిగించారా?

ఆర్బీఐ ఎప్పుడు, ఎలా స్థాపించారు?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని సెంట్రల్ బ్యాంక్. ఇది బ్యాంకింగ్ రెగ్యులేటర్. ఇది అన్ని బ్యాంకుల నిర్వహణకు నియమాలను రూపొందించి వాటిని పర్యవేక్షిస్తుంది. ఆర్‌బీఐ స్వయంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ కాలంలో స్థాపించారు. హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ దేశం కరెన్సీ, క్రెడిట్‌ను నియంత్రించడానికి ఏర్పాటు చేశారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 కింద స్థాపించారు. ఆర్బీఐ ఏప్రిల్ 1, 1935న పని చేయడం ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: Income Tax: మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా? ఈ పని చేయండి..లేకుంటే డబుల్‌ ట్యాక్స్‌

ఆర్బీఐ ప్రధాన విధులు:

  1. నోట్లను ముద్రించే హక్కు: నోట్లను ముద్రించే గుత్తాధిపత్యాన్ని ఆర్‌బీఐ కలిగి ఉంది. ఆర్బీఐ ఒక రూపాయి నోటు మినహా అన్ని రకాల నోట్లను జారీ చేస్తుంది (ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రమే జారీ చేస్తుంది).
  2. బ్యాంకుల కోసం నిబంధనలను రూపొందించడం: రిజర్వ్‌ బ్యాంక్‌ భారత ప్రభుత్వం, దేశంలోని బ్యాంకుల కోసం నియమాలను రూపొందించింది. అలాగే వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.
  3. ఫారెక్స్ నిల్వల నియంత్రణ: ఆర్బీఐ దేశం విదేశీ మారక నిల్వల సంరక్షకుడిగా పని చేస్తుంది. ఇది దేశం విదేశీ మారకపు రేటును స్థిరంగా ఉంచే లక్ష్యంతో విదేశీ కరెన్సీలను కొనుగోలు, విక్రయాలు జరుపుతుంది.
  4. ప్రత్యేక నాణెం: ఇదిలా ఉండగా ఆర్బీఐ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత ఏప్రిల్‌లో ఆర్బీఐ నాణెంను తయారు చేసింది దీనిపై RBI@90 అని అక్షరాలు ముద్రించారు. ఇది సంస్థ దీర్ఘకాల చరిత్రను, భారతదేశ ఆర్థిక శక్తిలో దాని ప్రాముఖ్యతను సూచిస్తుంది. దీనిపై ఉండే అశోక స్తంభం, లయన్‌ క్యాపిటల్‌, భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక. జాతీయ నినాదం సత్యమేవ జయతే అని కాయిన్‌ కింద భాగంలో దేవనగరి లిపిలో రాశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి