Rbi QR Code: వావ్..! చిల్లర కోసం చింతేలేదు.. QR కోడ్‌తో స్కాన్ చేస్తే చాలు.. నాణేలే.. నాణేలు..
నాణేల పంపిణీని ప్రోత్సహించడంతోపాటు నాణేల పరిధిని పెంచే లక్ష్యంతో ఈ యంత్రాలను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇందుకోసం వెండింగ్ మెషీన్‌లను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత.. ఏటీఎం కార్డు స్థానంలో క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దాని నుంచి నాణేలను విత్‌డ్రా చేసుకోవచ్చు.
ప్రతిరోజూ కొన్ని కొత్త టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకుపోతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగిపోతున్నాం. దీంతో లైఫ్ స్టైయిల్ కూడా చాలా ఈజీగా మారిపోతోంది. ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. మరో సరికొత్త టెక్నాలజీకి ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. ఈ మధ్య కాయిన్స్ నాణేలు కావాలనుకునేవారి కోసం కాయిన్ వెండింగ్ మెషిన్లను పరిచయం చేస్తోంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మెషిన్ల నుంచి నాణేలను తీసుకోవచ్చు. అయితే, ఈ వెండింగ్ మెషిన్లను ముందుగా 12 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లుగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఈ విషయం వెల్లడించారు.
ప్రస్తుతం నగదును తీసుకునేందుకు ఏ విధంగానైతే ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయో.. ఆ నోట్లకు బదులు నాణేలు కావాలనుకునేవారికి ఈ కాయిన్ వెండింగ్ మెషిన్లు పని చేస్తుంది. ఈ మెషిన్లలో స్క్రీన్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. మీకు కావాల్సి నాణేలను వెండింగ్ మెషిన్ నుంచి తీసుకోవచ్చు. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును చెల్లించి నాణేలు పొందొచ్చు.
అయితే, ఈ వెండింగ్ మెషిన్లను ముందుగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకొస్తోంది ఆర్బీఐ. ఈ క్యూసీవీఎంలను తొలత 12 నగరాల్లోని 19 చోట్ల ఏర్పాటు చేస్తారు. ఇందులో రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి ఈ నగరాల్లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. జనం నుంచి వచ్చే ప్రతిస్పందన, అది ఇచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని క్యూసీవీఎంలను ఏర్పాటు చేయనున్నారు. అయితే, అన్ని సెంటర్లలో నాణేలను అందుబాటులో ఉంచేలా బ్యాంకులకు గైడ్‌లైన్స్ జారీ చేసింది ఆర్బీఐ.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం