AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Postal Account Balance: పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ లో బ్యాలెన్స్ తెలియడం లేదా? ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు..

పోస్టాఫీస్ అందించే వివిధ సేవలను పొందాలనుకుంటే మాత్రం కచ్చితం వర్కింగ్ లో ఉన్న ఫోన్ నెంబర్ సేవింగ్స్ ఖాతాకు లింక్ చేసుకోవాలి. ప్రస్తుతం పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేసుకోడానికి ఉన్న మార్గాలను ఓ సారి తెలుసుకుందాం.

Postal Account Balance: పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ లో బ్యాలెన్స్ తెలియడం లేదా? ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు..
Post Office Scheme
Nikhil
|

Updated on: Feb 08, 2023 | 4:00 PM

Share

భారతదేశంలో చాలా మందికి పోస్టాఫీసుల్లో అకౌంట్లు ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో పల్లె జనాభా చాలా ఎక్కువ. ప్రతి పల్లెలో పోస్టాఫీసు ఉండడం వల్ల చాలా మంది పోస్టాఫీసుల్లో అకౌంట్ లు తీసుకుంటూ ఉంటారు. మారుతున్న టెక్నాలజీ మేరకు ఇండియా పోస్ట్స్ కూడా అప్డేట్ అయ్యి పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాదారులు వివిధ సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఫోస్టాఫీసు అకౌంటు తీసుకోవాలంటే రూ.500 మినిమిమ్ బ్యాలెన్స్ గా ఉంచాలి. అలాగే కొన్ని పోస్టాఫీస్ పథకాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీ ప్రకారం పలు ప్రయోజనాలు అందిస్తాయి. అలాగే మీరు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో సొమ్ము దాచుకుంటే దానిపై వచ్చే వడ్డీకి రూ.10000 వరకూ పన్నురహితంగా ఉంటుంది. అయితే పోస్టాఫీస్ అందించే వివిధ సేవలను పొందాలనుకుంటే మాత్రం కచ్చితం వర్కింగ్ లో ఉన్న ఫోన్ నెంబర్ సేవింగ్స్ ఖాతాకు లింక్ చేసుకోవాలి. ప్రస్తుతం పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేసుకోడానికి ఉన్న మార్గాలను ఓ సారి తెలుసుకుందాం.

ఈ-పాస్ బుక్

ఈ సదుపాయాన్ని 2022 లో ఇండియన్ పోస్ట్ ప్రారంభించింది. కస్టమర్లు ఎప్పుడైనా తమ ఖాతా ట్రాన్స్ యాక్షన్స్ చూసుకోవచ్చు. ముందుగా యాప్ ఓపెన్ మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. బ్యాలెన్స్ అండ్ స్టేట్ మెంట్స్ అనే ఆప్షన్ వద్ద స్టేట్ మెంట్ క్లిక్ చేయాలి. అనంతరం మీ డ్యాష్ బోర్డులో బ్యాలెన్స్ తో పాటు స్టేట్ మెంట్ వివరాలను పొందుతారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే స్టేట్ మెంట్ వివరాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

ఎస్ఎంఎస్ ద్వారా

మొదటగా మీ ఖాతకు రిజిస్టరైన మొబైల్ నెంబర్ నుంచి REGISTER అని టైప్ చేసి 77380 62873కు పంపాలి. అనంతరం మీరు రిజిస్టరైనట్లు సందేశం వస్తుంది. తర్వాత BAL అని టైప్ చేసి అదే నెంబర్ కు పంపడం ద్వారా మీ ఖాతాలోని బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మిస్ట్ కాల్ సర్వీస్

మీ పోస్టాఫీస్ అకౌంట్ కు లింక్ అయ్యిన మొబైల్ నుంచి 84240 54994 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే మీ ఖాతా బ్యాలెన్స్ ను సరిచూసుకోవచ్చు. 

ఐపీపీబీ మొబైల్ యాప్

మీ మొబైల్ లో ఐపీపీబీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఖాతా నెంబర్, సీఐఎఫ్ ఐడీ, పుట్టిన తేదీ వంటి వాటి ద్వారా యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం మొబైల్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి ఎం పిన్ ను సెట్ చేసుకోవాలి. అనంతరం మీ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి