Post Office Accounts: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మనీ ట్రాన్సఫర్ మరింత ఈజీగా.. అమల్లోకి కొత్త రూల్స్..

అన్ని బ్యాంకులు NEFT, RTGS సౌకర్యాన్ని అందిస్తాయి. తాజాగా పోస్టాఫీసు కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. NEFT, RTGS ద్వారా మరొక ఖాతాకు డబ్బు పంపడం చాలా సులభం.

Post Office Accounts: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మనీ ట్రాన్సఫర్ మరింత ఈజీగా.. అమల్లోకి కొత్త రూల్స్..
Post Office Money
Follow us

|

Updated on: Jul 26, 2022 | 1:59 PM

Post Office Accounts: మీరు పోస్ట్ ఆఫీస్ ఉపయోగిస్తుంటే లేదా మీరు పోస్ట్ ఆఫీస్ కస్టమర్ అయితే ఈ విషయం తెలుసుకోవడం చాలా కీలకం. పోస్టాఫీసుల్లో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. పోస్టాఫీసులో ఖాతాలు ఉన్న కస్టమర్లు ఇకనుంచి ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. NEFT, RTGS సౌకర్యాన్ని పోస్టాఫీసు ప్రారంభించింది. పోస్టాఫీసులో ఇటీవలే NEFT సౌకర్యం ప్రారంభం అయింది. దీనితోపాటు RTGS సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు పోస్టాఫీసు కస్టమర్లకు డబ్బు పంపేందుకు చాలా సులభం కానుంది. దీంతో ఇతర బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసులు కూడా మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతున్నాయి. ఈ సౌకర్యం మీ కోసం 365 రోజులు, 24 గంటలు, 7 రోజుల పాటు తెరిచే ఉండనుంది.

NEFT, RTGS ద్వారా డబ్బు పంపడం ఎంతో సులభం..

అన్ని బ్యాంకులు NEFT, RTGS సౌకర్యాన్ని అందిస్తాయి. తాజాగా పోస్టాఫీసు కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. NEFT, RTGS ద్వారా మరొక ఖాతాకు డబ్బు పంపడం చాలా సులభం. దీంతో త్వరగా నగదు బదిలీ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీనికి కూడా నిబంధనలు ఉన్నాయి. NEFTలో డబ్బును బదిలీ చేయడానికి పరిమితి లేదు. అయితే RTGSలో మీరు ఒకేసారి కనీసం రెండు లక్షల రూపాయలను పంపాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఛార్జీలు ఎలా ఉన్నాయంటే..

దీని కోసం మీరు కొన్ని ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు NEFT చేస్తే, మీరు ఇందులో 10 రూపాయల వరకు రూ. 2.50 + GST ​చెల్లించాలి. 10 వేల నుంచి 1 లక్ష రూపాయలకు, 5 రూపాయలు + GST ​ పడుతుంది. అదే సమయంలో, రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు, రూ. 15 + GST, 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రూ. 25 + GST ​చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..