Honda Forza: ఆగస్టు 8న హోండా నుంచి ఫోర్జా మ్యాక్సీ స్కూటర్.. అద్భుతమైన ఫీచర్స్ !
Honda Forza: మార్కెట్లో రకరకాల బైక్‌లు విడుదలవుతున్నాయి. యువతను మరింతగా ఆకర్షించేందుకు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను అందుబాటులోకి..
Honda Forza: మార్కెట్లో రకరకాల బైక్‌లు విడుదలవుతున్నాయి. యువతను మరింతగా ఆకర్షించేందుకు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి పలు కంపెనీలు. ఇక తాజాగా హోండా నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్‌ను భారత్‌లో విడుదల చేయబోతోంది. ఈ స్కూటర్ ఆగస్టు 8న మార్కెట్లోకి రానుంది. ఇటీవల కంపెనీ ఈ రాబోయే మాక్సీ స్కూటర్‌ను టీజ్ చేసింది. హోండా Forza maxi అనే స్కూటర్ త్వరలో రానుంది. ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయో హోండా వెల్లడించకపోయినా.. హోండా ఫోర్జా 350గా ఉండనున్నట్లు తెలుస్తోంది. దేశంలో హోండా డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉండనుంది. ఈ ఫోర్జీ 125, ఫోర్జా 350maxi స్కూటర్ రెండూ యూరప్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఇతర మార్కెట్లో విక్రయాలు కొనసాగనున్నాయి. ఫోర్జా 125 స్కూటర్ 124సీసీ ఇంజన్‌తో 8.14bhp, 10.3ఎన్‌ఎం సింగిల్-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ మోటార్ అమర్చింది కంపెనీ.
ఇక ఫోర్జా 350maxi స్కూటర్ ముందు వెనుక అల్లాయ్ వీల్స్‌తో ఉండనుంది. ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఇది రెండు రకాలుగా అందుబాటులోకి రానుంది. ఈ స్కూటర్‌కు డిజిటల్ డిప్‌ప్లే ఉంటుంది. అత్యవసర స్టాప్ సిగ్నల్, యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్, ఆల్ ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్‌తో వస్తున్నట్లు లీకుల ద్వారా సమాచారం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..