Fixed deposits: మాకు ఫిక్స్‌డ్ డిపాజిట్టే ముద్దు! మరే పథకమూ వద్దు? సర్వే తేల్చిందిదే..
మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ఎక్స్ చేంజ్ వంటి చాలా పెట్టుబడి మార్గాలు ఉండగా.. కేవలం ఎఫ్ డీ కే ఎందుకు ఇంత క్రేజ్? ముఖ్యంగా మనదేశంలో ఈ ఎఫ్ డీ లపైనే ప్రజలకు ఎందుకు అంత నమ్మకం?
మనం నగదు భవిష్యత్ అవసరాలను కోసం దాచుకోవాలి అంటే మొదట గుర్తొచ్చే పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ). సురక్షిత పెట్టుబడి పథకాల్లో ఇదే మొదట ఉంటుంది. తమ వద్ద కొంత మిగులు సొమ్ము ఉన్న వాళ్లు దానిపై హామీ పూర్వకమైన రిటర్ను రావాలని భావిస్తే ముందుగా ఆలోచించేది ఫిక్స్ డ్ డిపాజిట్ గురించే. మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ఎక్స్ చేంజ్ వంటి చాలా పెట్టుబడి మార్గాలు ఉండగా.. కేవలం ఎఫ్ డీ కే ఎందుకు ఇంత క్రేజ్? మిగిలిన పథకాలతో పోల్చితే దీనిలో తమ నగదు భద్రం అని ప్రజలు ఎందుకు భావిస్తారు? ముఖ్యంగా మనదేశంలో ఈ ఎఫ్ డీ లపైనే ప్రజలకు ఎందుకు అంత నమ్మకం? సరిగ్గా ఇదే పాయింట్లపై ఓ అంతర్జాతీయ సంస్థ సర్వే చేపట్టింది. ఎఫ్ డీలపై ప్రజలకు ఎందుకు ఇంత నమ్మకం ఏర్పడింది అన్న విషయాలను క్రోడీకరించింది. దానిలో ఎక్కువ మంది చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. ఇది మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుదు. స్థిరమైన రాబడిని ఇస్తుంది. పూర్తి భద్రత ఉంటుంది. అని చెప్పారంటా.. సర్వేలో పాల్గొన్న 44 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎవరు చేశారు ఈ సర్వే..
ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన కువేరా ఈ సర్వే చేసింది. భారతీయులలో ఎఫ్‌డీల ప్రజాదరణకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి సుమారు 1.6 మిలియన్ల పెట్టుబడిదారులను విచారించింది. ఈ సర్వే ఫలితాలను కువేరా సహ వ్యవస్థాపకుడు గౌరవ్ రస్తోగి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఎఫ్డీ లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయన్నారు. అది ఎందుకు అంత బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయో తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టామన్నారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయని చెప్పారు. ముఖ్యంగా సరళమైన విధానం, పెట్టుబడికి భద్రత, హామీ, మంచి రాబడి, అత్యవసర సమయంలో ఉపయోగపడటానికి ఇదే అత్యుత్తమ విధానమని చాలా మంది అభిప్రాయపడినట్లు వెల్లడించారు. కువేరా చేసిన సర్వేలో ప్రతి ఐదుగురు ప్రతివాదులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, అత్యవసర నిధులుగా ఈ ఎఫ్ డీలను ఎంచుకుంటున్నారని తేలింది. దాదాపు 12% మంది పెట్టుబడిదారులు ఎఫ్ డీ ని పరిచయం పథకం, అలాగే సరళమైన విధానం కారణంగా పెట్టుబడిలో పెడుతున్నట్లు గుర్తించింది. అలాగే ప్రతి పది మందిలో ఒకరు మార్కెట్ అస్థిరత దీనిపై ప్రభావం చూపకపోవడం, పెట్టుబడికి భద్రత ఉండటం కారణంగా దీనిలో పెట్టుబడి పెడుతున్నట్లు నిర్ధారించింది.
SEBI ఏమి కనుగొంది..
2017లో, పెట్టుబడిదారుల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి SEBI ఒక సర్వే నిర్వహించింది. 95% కంటే ఎక్కువ కుటుంబాలు తమ నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉంచడానికి ఇష్టపడతాయని, కేవలం 10% మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్‌లను ఇష్టపడుతున్నారని ఇది కనుగొంది. వాస్తవానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) డేటా ప్రకారం , మొత్తం బ్యాంక్ డిపాజిట్లు మార్చి 2022లో 2,242.775 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..