FD Premature Withdrawal: ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు ఆర్‌బీఐ ఊరట.. అకాల ఉపసంహరణ పరిమితి పెంపు
బ్యాంకులు దేశీయ టర్మ్ డిపాజిట్లు (టీడీలు) లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను (ఎఫ్‌డీలు) అకాల ఉపసంహరణ ఎంపిక లేకుండా అందించడానికి అనుమతించాయి. అయితే వ్యక్తుల నుంచి రూ. 15 లక్షలు అంతకంటే తక్కువ మొత్తంలో ఆమోదించిన అన్ని టీడీలు అకాల ఉపసంహరణ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా డిపాజిట్ల కాలవ్యవధి, డిపాజిట్ల పరిమాణానికి అదనంగా డిపాజిట్‌ల కాల్‌బిలిటీ ఆధారంగా టీడీలపై వడ్డీపై ప్రత్యేక రేట్లు అందించడానికి బ్యాంకులను అనుమతించింది. ఎఫ్‌డీలపై ఆర్‌బీఐ తాజా నియమాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ముందస్తు ఉపసంహరణలకు సంబంధించిన నియమాన్ని మార్చింది. ప్రస్తుతం బ్యాంకులు రూ. 15 లక్షల వరకు ఎఫ్‌డీలపై ముందస్తు విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు ఆర్‌బీఐ తక్షణం అమలులోకి వచ్చేలా ఈ మొత్తాన్ని రూ.1 కోటికి పెంచింది. ఇప్పటి వరకు బ్యాంకులు దేశీయ టర్మ్ డిపాజిట్లు (టీడీలు) లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను (ఎఫ్‌డీలు) అకాల ఉపసంహరణ ఎంపిక లేకుండా అందించడానికి అనుమతించాయి. అయితే వ్యక్తుల నుంచి రూ. 15 లక్షలు అంతకంటే తక్కువ మొత్తంలో ఆమోదించిన అన్ని టీడీలు అకాల ఉపసంహరణ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా డిపాజిట్ల కాలవ్యవధి, డిపాజిట్ల పరిమాణానికి అదనంగా డిపాజిట్‌ల కాల్‌బిలిటీ ఆధారంగా టీడీలపై వడ్డీపై ప్రత్యేక రేట్లు అందించడానికి బ్యాంకులను అనుమతించింది. ఎఫ్‌డీలపై ఆర్‌బీఐ తాజా నియమాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఆర్‌బీఐ ఇటీవల నిర్వహించిన సమీక్షలో నాన్ కాల్ చేయని టీడీలను అందించడానికి కనీస మొత్తం పదిహేను లక్షల రూపాయల నుంచి ఒక కోటి రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. అంటే ఒక కోటి రూపాయలు, అంతకంటే తక్కువ మొత్తంలో వ్యక్తుల నుంచి స్వీకరించబడిన అన్ని దేశీయ టర్మ్ డిపాజిట్లు ముందస్తుగా ఉపసంహరించుకునే సౌకర్యం ఉంటుంది. ఈ మేరకు ఆర్‌బీఐ ఓ సర్క్యూలర్‌ను రిలీజ్‌చేసింది. ఈ సూచనలు ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓ ఖాతాలకు కూడా వర్తిస్తాయని పేర్కొంది. దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులకు ఆర్‌బీఐ తాజా నియమాలను పాటించాల్సి ఉంటుంది.
సాధారణంగా బ్యాంకులు రెండు రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తాయి. కాల్ చేయదగినవి రెండోది కాల్ చేయదగినవి కానివి. కాల్ చేయగల ఎఫ్‌డీల్లో అకాల ఉపసంహరణ అనుమతిస్తారు. కాల్ చేయని ఎఫ్‌డీల్లో ఇది అనుమతించబడదు. బ్యాంకులు అకాల ఉపసంహరణ ఎంపిక లేకుండా ఎన్‌ఆర్‌ఈ/ ఎన్‌ఆర్‌ఓ టర్మ్ డిపాజిట్లను అందించే స్వేచ్ఛను కలిగి ఉంటాయి. కానీ ప్రస్తుతం ఒక కోటి రూపాయలు, అంతకంటే తక్కువ మొత్తంలో వ్యక్తుల నుంచి అన్ని ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ టర్మ్ డిపాజిట్లు అకాల ఉపసంహరణ సదుపాయాన్ని కలిగి ఉంటాయి. మే 2022 నుంచి ఆర్‌బీబిఐ నిరంతర రేట్ల పెంపుదల తర్వాత ఇప్పుడు బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందజేస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ డిపాజిట్, రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపిన తర్వాత భవిష్యత్‌లో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా ఎఫ్‌డీపై 7.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. పీఎన్‌బీ ఏటా 7.75 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. ఎస్‌బీఐ సంవత్సరానికి 7.50 శాతం వరకు ఇస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి