Business ideas: తక్కువ పెట్టుబడితో బ్రెడ్ తయారీ వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.
అయితే తెలివితో ఆలోచించాలే కానీ తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి ఎన్నో బిజిసెస్ ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో బ్రెడ్ తయారీ ఒకటి. బ్రెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఇంతకీ బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీని ఎలా మొదలు పెట్టాలి.? దీనికి ఎంత పెట్టుబడి అవసరపడుతుంది.? ఎంత ఆదాయం పొందొచ్చు.?
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ముందుగా ఆలోచించేంది పెట్టుబడి, ఆ తర్వాత వచ్చే ఆదాయం. పెట్టిన పెట్టుబడికి తగినట్లు రిటర్న్స్ రాకపోతే ఎలా అనే భయంతోనే చాలా మంది వ్యాపారానికి వెనుకడుగు వేస్తుంటారు. అందుకే భద్రత ఉంటుందని నచ్చని ఉద్యోగమైనా సరే చేస్తుంటారు.
అయితే తెలివితో ఆలోచించాలే కానీ తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి ఎన్నో బిజిసెస్ ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో బ్రెడ్ తయారీ ఒకటి. బ్రెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఇంతకీ బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీని ఎలా మొదలు పెట్టాలి.? దీనికి ఎంత పెట్టుబడి అవసరపడుతుంది.? ఎంత ఆదాయం పొందొచ్చు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ప్రస్తుతం బ్రెడ్ ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతీ రోజూ టిఫిన్‌లో బ్రెడ్ తీసుకుంటున్నారు. అలాగే టోస్ట్‌లు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా బ్రెడ్ తయారీని ప్రారంభించే మంచి ఆదాయం పొందొచ్చు. బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించాలనుకుంటే కనీసం రూ. 5 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర యోజన పథకం ద్వారా కూడా ఆర్థిక సాయాన్ని పొందొచ్చు. రూ. 5 లక్షల ప్రాథమిక పెట్టుబడితే బ్రెడ్ తయారీని ప్రారంభించొచ్చు. బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీని 500 నుంచి 800 చదరపు అడుగుల స్థలం అవసరపడుతుంది.
బ్రెడ్ తయారీకి అవసరమయ్యే యంత్రాలు ఆన్‌లైన్‌లో పొందొచ్చు. బ్రెడ్ తయారీకి పిండి, గ్లూటెన్, బ్రెడ్ ఇంప్రూవర్, కాల్షియం పౌడర్, డ్రై ఈస్ట్, ఉప్పు, చక్కెర, నూనె, ప్యాకింగ్ కోసం మెటీరియ్ అవసర పడుతుంది. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, జీఎస్‌టీ నెంబర్‌తో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎన్‌ఓసీ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఇక సొంత బ్రాండ్‌తో విక్రయించాలనుకుంటే దీనికి ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక బ్రెడ్ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం విషయానికొస్తే.. సాధారణంగా బ్రెడ్ ప్యాకెట్ ధర రూ. 30 నుంచి రూ. 60 వరకు ఉంది. అయితే బ్రెడ్ తయారీకి అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది. మీరు తయారు చేసిన బ్రెడ్ ప్యాకేట్స్‌ను స్వంతంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రారంభ స్థాయిలోనే రూ. 50,000 వేల ఆదాయం పొందొచ్చు. క్రమేణ ఈ ఆదాయం రూ. లక్ష వరకు పెరుగుతుంది. స్థానికంగా ఉండే దుకాణాలు, సూపర్ మార్కెట్స్‌లో ఒప్పందం చేసుకుంటే ఆదాయం మరింత పెంచుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..