RBI News: సిబిల్ స్కోర్ సమస్యలకు ఆర్‌బీఐ చెక్.. గడుపు లోపు సమస్య పరిష్కరించకపోతే రోజుకు రూ.100 ఫైన్
సీఐసీలు అంటే మన క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ అందించే సంస్థలు అయితే ఈ క్రెడిట్ సమాచారాన్ని ఇవ్వడానికి ఇటీవల సీఐసీ చాలా సమయం తీసుకుంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలకు షాక్ ఇస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయడంతో పాటు సరిదిద్దడంలో జాప్యాన్ని నివారించేలా సీఐసీ సంస్థలకు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
సీఐసీలు అంటే క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలు. ఈ సంస్థ ఓ ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ. ఈ సంస్థలకు వ్యక్తులకు సంబంధించిన ఆర్థిక డేటాను విశ్లేషించి దాని సభ్యులతో పంచుకుంటుంది. ముఖ్యంగా రుణాలతో పాటు క్రెడిట్ కార్డుల సమాచారం పొందడానికి సీఐసీ సమాచారాన్ని చాలా కీలకంగా ఆర్థిక సంస్థలు భావిస్తాయి. సీఐసీలు అంటే మన క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ అందించే సంస్థలు అయితే ఈ క్రెడిట్ సమాచారాన్ని ఇవ్వడానికి ఇటీవల సీఐసీ చాలా సమయం తీసుకుంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలకు షాక్ ఇస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయడంతో పాటు సరిదిద్దడంలో జాప్యాన్ని నివారించేలా సీఐసీ సంస్థలకు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుదారుల ఫిర్యాదును 30 రోజుల్లోపు పరిష్కరించకపోతే రోజుకు రూ.100 చొప్పున్న ఫిర్యాదుదారులకు చెల్లించాలని ఆదేశించింది. ఆర్‌బీఐ తాజా ఆదేశాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఫిర్యాదుదారుడు సీఐసీ లేదా సీఐకు మొదట ఫిర్యాదును దాఖలు చేసిన తేదీ నుంచి కచ్చితంగా ముప్పై రోజుల్లోపు ఫిర్యాదును పరష్కరించాలి. అలా పరిష్కరించని పక్షంలో జరిమానాను ఫిర్యాదుదారుడికి చెల్లించాలి. ముఖ్యంగా సీఐసీ వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన సమాచారాన్ని పొందిన తర్వాత కూడా అప్‌డేట్ చేయకుండా జాప్యం చేస్తే ఆర్‌బీఐ తాజా నిర్ణయం ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సీఐలకు సంబంధించిన ఫిర్యాదుదారు సీఐసీ ద్వారా తెలియజేసిన 21 రోజుల్లోపు సీఐసీలకు అప్‌డేట్ చేసిన క్రెడిట్ సమాచారాన్ని పంపడంలో విఫలమైతే అప్పుడు సీఐలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి దశలోనూ సమాచారం
సీఐసీ తమ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్‌ను నిర్ధిష్ట వినియోగదారులు యాక్సెస్ చేసినప్పుడు ఎస్‌ఎంఎస్ లేదా ఈ-మెయిల్స్‌ను పంపాలని ఆర్‌బీఐ పేర్కొంది. సీఐసీ రూపొందించిన అధికారిక రిపోర్ట్ ద్వారా సీఐఆర్ విచారణ జరిగితేనే నోటిఫికేషన్లను వస్తాయని గమనించాలి. అయితే ఈ సమాచారం కేవలం మొబైల్/ ఈ-మెయిల్స్ ఇచ్చిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి వినియోగదారులకు మొబైల్/ఈ-మెయిల్స్ అందజేయడం వల్ల కలిగే ప్రయోజనాలను సీఐసీ ప్రత్యేక ప్రచారాల అవగాహన కల్పించాలని ఆర్‌బీఐ సూచించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..