Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crypto Investing: క్రిప్టోలో పెట్టుబడి పెడుతున్నారా? భద్రతతో పాటు వ్యూహాలు కూడా ముఖ్యమే..!

ముఖ్యంగా క్రిప్టోస్‌ను ఏ కేంద్ర అధికారాలు నియంత్రిచలేవు. క్రిప్టో కరెన్సీ విషయంలో అనేక అపోహలు ఉన్నప్పటికీ కొత్త తరం పెట్టుబడిదారులు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల కాలంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడుతున్నారు.

Crypto Investing: క్రిప్టోలో పెట్టుబడి పెడుతున్నారా? భద్రతతో పాటు వ్యూహాలు కూడా ముఖ్యమే..!
Crypto
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 28, 2023 | 9:55 PM

క్రిప్టో కరెన్సీ అంటే క్రిప్టోగ్రఫీ ద్వారా భద్రపరిచే వర్చువల్‌ కరెన్సీ. దీన్ని క్రిప్టో ఆల్గారిథమ్‌ల కారణంగా క్రిప్టోస్‌ నకిలీ లేదా డబుల్‌ ఖర్చు చేయడం దాదాపు అసాధ్యం. ఇలాంటి డిజిటల్‌ ఆస్తులు బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వికేంద్రీకృత లెడ్జర్‌ల ద్వారా నిర్వహిస్తారు. ముఖ్యంగా క్రిప్టోస్‌ను ఏ కేంద్ర అధికారాలు నియంత్రిచలేవు. క్రిప్టో కరెన్సీ విషయంలో అనేక అపోహలు ఉన్నప్పటికీ కొత్త తరం పెట్టుబడిదారులు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల కాలంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే క్రిప్టో కరెన్సీలు పెట్టుబడి పెట్టే ముందు దాన్ని అర్థం చేసుకోవాలని మార్కెట్‌ నిపుణులు సూచిస్తూ ఉంటారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి సమయంలో ఎలాంటి విషయంలో అవగాహనతో ఉండాలో? ఓ సారి తెలుసుకుందాం.

కొనుగోలు, అమ్మకం

క్రిప్టో కరన్సీను ట్రేడింగ్‌ ప్లాట్‌ఫారమ్‌గా ఎంచుకుంటే మన వద్ద ఉన్న సాధారణ కరెన్సీను క్రిప్టో మార్చే ప్లాట్‌ఫారమ్‌ల గురించి తెలుసుకోవాలి. అయితే ఆయా ప్లాట్‌ఫారాల్లో ప్రాథమిక, కొనుగోలుతో అమ్మకాలు ఎలా సాగించాలో అవగాహన పెంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనకు అవసరమైనప్పుడు సులువుగా మనం నిష్క్రమించే అవకాశం ఉంది. దైనందిన జీవితంలో క్రిప్టోకరెన్సీకు సంబంధించిన  లాభాలను పొందడానికి స్థానిక కరెన్సీకు క్యాష్‌ అవుట్‌ చేయడం చాలా కీలకమని గమనించాలి. 

పెట్టుబడి భద్రత

క్రిప్టోకరెన్సీ ఏ రెగ్యూలేటరీ అథారిటీ పరిధిలో లేవనే విషయంలో అందరికీ తెలిసిందే. అయినా కూడా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే అదనపు భద్రతా చర్యలు తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా చాలా మంది పెట్టుబడిదారులు గతంలో వేల కొద్దీ డాలర్లు కోల్పోయారని గమనించాలి.

ఇవి కూడా చదవండి

విభిన్న పోర్ట్‌ఫోలియోలు

ఇతర ఆర్థిక ఆస్తుల మాదిరిగానే క్రిప్టో కరెన్సీ కూడా మిమ్మల్ని విభిన్నమైన ప్రోర్ట్‌ఫోలియోలను సొంతం చేసుకునే అవకాశం ఇస్తుంది. క్రిప్టో డైవర్సీఫికేషన్‌ అనేది పెట్టుబడి వ్యూహం. దీని ద్వారా పెట్టుబడిదారుడు ఒకటి కంటే ఎక్కువ క్రిప్టో కరెన్సీ మాడ్యూల్స్‌ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ వ్యూహం పెట్టుబడిదారుడు వివిధ టోకెన్ల నుంచి డబ్బు సంపాదించడంలో సాయం చేస్తుంది. ఒక పెట్టుబడి విఫలమైన ఇతర పెట్టుబడుల ద్వారా నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. 

పరిశోధన

పెట్టుబడిదారుడు తన క్రిప్టో పెట్టుబడిపై పూర్తిస్థాయి అవగాహనతో ఉండాలి. క్రిప్టో కరెన్సీతో సంబంధం ఉన్న సంభావ్య నష్టాలతో పాటు లాభాల గురించి పరిశోధన చేయాలి. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలో ప్రాథమిక విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. క్షుణ్ణమైన పరిశోధన చేసిన తర్వాత మాత్రమే క్రిప్టోలో పెట్టుబడికి ముందుకు వెళ్లాలి. 

సమయపాలన

రియల్‌ ఎస్టేట్‌, స్టాక్స్‌, డెట్‌, క్రిప్టో ఏ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన సమయపాలన అనేది చాలా కీలకం. షేర్‌ మార్కెట్‌లో జరిగినట్టు క్రిప్టోలో కూడా ఎక్కువ సమయం పెట్టుబడి పెట్టడం అంటే సెంటిమెంట్‌తో కూడుకున్న విషయం. సాధారణంగా క్రిప్టోలో పెట్టుబడిని దీర్ఘకాలిక పెట్టుబడిగా ఎవరూ చూడరు. వీలైనంతగా త్వరగా క్రిప్టోను క్యాష్‌ చేసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల పెట్టుబడిదారుడు ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి