Rs 2000 Notes: 93 శాతం పింక్ నోట్లు బ్యాంకుల్లో జమ.. ఇంకా వెనక్కి రాని నోట్ల విలువ ఎంతంటే..?

రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19న సంచనల ప్రకటన చేయడం తెలిసిందే. తమ దగ్గరున్న రూ.2000 కరెన్సీ నోట్లను డిపాజిట్లు, మార్పిడి రూపంలో బ్యాంకులకు చేరుతున్నాయి. నోట్ల ఉపసంహరణ ప్రకటించిన నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో ఇప్పటి వరకు 93 శాతం తిరిగి బ్యాంకుల్లో జమ అయినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది.

Rs 2000 Notes: 93 శాతం పింక్ నోట్లు బ్యాంకుల్లో జమ.. ఇంకా వెనక్కి రాని నోట్ల విలువ ఎంతంటే..?
Rs 2000 Notes
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 01, 2023 | 6:52 PM

Rs 2000 Notes – RBI News: రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19న సంచనల ప్రకటన చేయడం తెలిసిందే. తమ దగ్గరున్న రూ.2000 కరెన్సీ నోట్లను డిపాజిట్లు, మార్పిడి రూపంలో బ్యాంకులకు చేరుతున్నాయి. నోట్ల ఉపసంహరణ ప్రకటించిన నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో ఇప్పటి వరకు 93 శాతం తిరిగి బ్యాంకుల్లో జమ అయినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంకుల నుంచి అందిన డేటా మేరకు.. ఆగస్టు 31 తేదీ వరకు బ్యాంకుల్లో జమ అయిన రూ.2000 నోట్ల విలువ రూ.3.32 లక్షల కోట్లుగా ఆర్బీఐ వెల్లడించింది. రూ.2000 నోట్లలో దాదాపు 87 శాతం డిపాజిట్ల రూపంలోనే బ్యాంకు ఖాతాల్లోకి రాగా.. 13 శాతం నోట్లను బ్యాంకుల్లో ఇతర నోట్లతో ఎక్సేంజ్ చేసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఇంకా వెనక్కి రాని నోట్ల విలువ ఎంతంటే..?

2018 మార్చి 31 నాటికి రూ.6.73 లక్షల కోట్ల మేర రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నట్లు అంచనా.  2023 మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్లు మాత్రమే చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది. ఈ నోట్ల ఉపసంహరణ ప్రకటించే నాటికి (అంటే మే 17, 2023) రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆర్బీఐ తాజా ప్రకటన మేరకు.. ఆగస్టు 31 వరకు రూ.3.32 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ కావడంతో.. ఇంకా రూ.24 వేల కోట్ల రూ.2000 నోట్లు బ్యాంకులకు వెనక్కి రావాల్సి ఉంది.

రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ మే 19న ప్రకటించింది. వినియోగదారులకు రూ.2000 నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు వీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 30 వరకు గడువు…

రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఉంది. చివరి గడువు తేదీ వరకు వేచి చూడకుండా తమ దగ్గరున్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో జమ చేయడం లేదా ఎక్సేంజ్ చేయాలని ఆర్బీఐ ప్రజలకు ఇప్పటికే సూచించింది. రూ.2000 నోట్ల మార్పిడి గడువును పొడగించే యోచన ప్రభుత్వానికి లేదని ఇటీవల కేంద్రం స్పష్టంచేసింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.