Shopping Tips: షాపింగ్ చేస్తున్నపుడు మీరు కొంటున్న వస్తువులపై ఈ సర్టిఫైడ్ మార్క్స్ గమనించారా..?
BIS.. అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స. బీఐఎస్ అనేది భారతదేశంలో జాతీయ ప్రమాణాలను నిర్ణయించే సంస్థ. ఇది వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. బీఐఎస్ ప్రోడక్ట్ శాంపిల్స్ టెస్ట్ చేయడానికి చాలా ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ల్యాబ్ లలో ప్రొడక్ట్స్ శాంపిల్స్ పరీక్షించిన తరువాత సర్టిఫై చేస్తారు. సర్టిఫై చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఈ ప్రోడక్ట్స్ క్వాలిటీని నిర్ధారించడం. ప్రోడక్ట్ గురించి వినియోగదారుల మధ్య..
రమ తన ఇంటి కోసం చాలా వస్తువులను కొంటుంది. ఆమె స్థానిక స్టోర్‌లతో పాటు పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి షాపింగ్ చేస్తుంది. కానీ, షాపింగ్ చేస్తున్నప్పుడు బయటి నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ క్వాలిటీని ఆమె పెద్దగా పట్టించుకోదు. ప్రొడక్ట్స్ రెగ్యులేటింగ్ ఏజెన్సీ ద్వారా సర్టిఫై అయ్యాయా.. లేదా అని ఆమె ఎప్పుడూ చెక్ చేయదు. ఫుడ్ అండ్ బెవరేజేస్ నుంచి.. బంగారం, వెండి వరకూ.. అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తో సహా అన్నిరకాల వస్తువులూ సర్టిఫై అయి ఉండాలి. ఏదైనా వస్తువు కొనే ముందు అవి సర్టిఫై అయినవా.. ?కాదా? అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అందువల్ల రమలా మీరు తప్పు చేయవద్దు. తప్పనిసరిగా మీరు వస్తువులను కొనేముందు ఆ ప్రొడక్ట్స్ సర్టిఫై అయ్యయో లేదో చెక్ చేసుకోండి.
అసలు ఈ వస్తువుల నాణ్యతను ఎవరు సర్టిఫై చేస్తారు?
BIS.. అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ . బీఐఎస్ అనేది భారతదేశంలో జాతీయ ప్రమాణాలను నిర్ణయించే సంస్థ. ఇది వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. బీఐఎస్ ప్రోడక్ట్ శాంపిల్స్ టెస్ట్ చేయడానికి చాలా ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ల్యాబ్ లలో ప్రొడక్ట్స్ శాంపిల్స్ పరీక్షించిన తరువాత సర్టిఫై చేస్తారు.
సర్టిఫై చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఈ ప్రోడక్ట్స్ క్వాలిటీని నిర్ధారించడం. ప్రోడక్ట్ గురించి వినియోగదారుల మధ్య నమ్మకాన్నిపెంచడం. ఇప్పుడు కొన్ని రకాల బీఐఎస్ సర్టిఫికేషన్ మార్కుల గురించి తెలుసుకుందాం. సర్టిఫికేషన్ కోసం ఐఎస్‌ఐ మార్క్, బీఐఎస్ హాల్‌మార్క్, Agmark, FPO మార్క్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
- ISI మార్క్: ఐఎస్‌ఐ అనేది ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థకు స్మాల్ ఫాం. ఇంతకుముందు ఐఎస్‌ఐ ని బీఐఎస్ అని పిలిచేవారు. ఐఎస్‌ఐ మార్క్ అనేది భారతదేశంలోని పారిశ్రామిక ఉత్పత్తులు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని రుజువు చేసే గుర్తు. దేశంలోని కొన్ని ప్రొడక్ట్స్ కు ఐఎస్‌ఐ గుర్తు తప్పనిసరి. స్విచ్‌లు, ఎలక్ట్రిక్ మోటార్లు, వైరింగ్ కేబుల్స్, హీటర్‌లు, కిచెన్ లో ఉపయోగించే పరికరాలు మొదలైన అనేక ఎలక్ట్రిక్ ఉపకరణాలకు ఇది తప్పనిసరి. పోర్ట్‌ల్యాండ్ సిమెంట్, ఎల్‌పీజీ వాల్వ్‌లు, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆటోమోటివ్ టైర్లు మొదలైన ఉత్పత్తులకు కూడా ఇది తప్పనిసరి. ఇతర రకాల ఉత్పత్తులకు ఐఎస్‌ఐ గుర్తు ఆప్షనల్ అటువంటి ప్రొడక్ట్స్ అలాగే వాటి ప్యాకెట్లపై ఐఎస్‌ఐ గుర్తును చూసిన తర్వాత మాత్రమే మీరు అటువంటి ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయాలి.
- బీఐఎస్ హాల్‌మార్క్ : బీఐఎస్ హాల్‌మార్క్ అనేది భారతదేశంలో అమ్మే బంగారం, వెండి ఆభరణాల కోసం ఒక హాల్‌మార్కింగ్ సిస్టమ్. బీఐఎస్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆభరణాలు హాల్‌మార్క్ చేస్తారు. సర్టిఫై చేసిన ఆభరణాలపై బీఐఎస్ హాల్‌మార్క్ ఉంటుంది. అంతేకాకుండా ఆభరణాల స్వచ్ఛత కూడా క్యారెట్‌లో ఇస్తారు. ఆభరణాలు కూడా ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్‌ను కలిగి ఉంటాయి. ఐఎస్‌ఐ మార్క్ లేదా బీఐఎస్ హాల్‌మార్క్ సరైనదో కాదో బీఐఎస్ పోర్టల్ లేదా బీఐఎస్ కేర్ యాప్‌లో మీ అంత మీరు స్వయంగా చెక్ చేసుకోవచ్చు.
- అగ్‌మార్క్: Agmark అనేది భారతదేశంలో అమ్మకానికి ఉంచే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కి ధృవీకరణ గుర్తు. వివిధ ప్రభుత్వ సంస్థలచే నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రోడక్ట్ తాయారు అయిందని ఇది నిర్ధారిస్తుంది. ప్రస్తుత అగ్‌మార్క్ ప్రమాణంలో 224 విభిన్న వ్యవసాయ వస్తువుల నాణ్యతకు సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి. ఇవి కాయధాన్యాలు, ఎడిబుల్ ఆయిల్స్, పండ్లు-కూరగాయలు మొదలైన వాటికి సంబంధించినవి.
- FPO మార్క్: ఇక చివరగా ఎఫ్‌పీవో మార్క్ గురించి తెలుసుకుందాం. దేశంలో అమ్మే అన్ని ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు ఇది ధృవీకరణ గుర్తు. ప్యాక్ చేసిన పండ్ల పానీయాలు, పండ్ల జామ్‌లు, ఊరగాయలు మొదలైన పండ్లతో తయారు చేసిన అన్ని రకాల ప్రొడక్ట్స్ కు ఈ గుర్తు తప్పనిసరి. ఆ ప్రోడక్ట్ పరిశుభ్రంగా -సురక్షితమైన పద్ధతిలో తయారు అయింది. అలాగే, వినియోగానికి తగినది అని FPO మార్క్ హామీ ఇస్తుంది.
ఇకపై మీరు షాపింగ్ చేసినపుడు తప్పనిసరిగా ఈ సర్టిఫైడ్ మార్క్స్ మీ ప్రొడక్ట్స్ పై ఉన్నాయో లేదో చెక్ చేసుకుని తీసుకోండి. క్వాలిటీ వస్తువులనే వినియోగించండి. మీ డబ్బు.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి