RBI: ఆర్బీఐ వడ్డీ రేట్లను ప్రకటించనుందా..? బ్యాంకు రుణ ఈఎంఐ పెరగనుందా..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల పాటు మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరుగుతోంది. బుధవారం మూడో రోజు కొనసాగనుంది. అయితే పాలసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల పాటు మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరుగుతోంది. బుధవారం మూడో రోజు కొనసాగనుంది. అయితే పాలసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటిస్తారు . ఈ సమావేశం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సమావేశం బడ్జెట్ తర్వాత మొదటి సమావేశం. ఆర్బీఐ విధానం వడ్డీ రేటును అంటే రెపో రేటును పెంచుతుందా లేదా ఎటువంటి మార్పు లేకుండా వదిలేస్తుందా అనేది చూడాలి. ప్రభుత్వం పాలసీ రేటును పెంచదని కొందరు నిపుణులు విశ్వసించగా, మరికొందరు విశ్లేషకులు ప్రభుత్వం పాలసీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని భావిస్తున్నారు. దీంతో బ్యాంకు రుణాల ఈఎంఐ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
భారతదేశ ద్రవ్యోల్బణం నిరంతరం తగ్గుతోందని, అటువంటి పరిస్థితిలో 6.25 శాతానికి చేరిన పాలసీ రేటును మరింత పెంచాల్సిన అవసరం పరిమితంగా ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. భారతదేశంలో ప్రధాన ద్రవ్యోల్బణం చాలా కాలం పాటు అధిక స్థాయిలో ఉన్న తర్వాత 2022 రెండవ సగం నుండి తగ్గుతోందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో, పాలసీ రేటు ఇప్పటికే 6.25 శాతం అధిక స్థాయిలో ఉంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ వివిధ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడిన కారణంగా గత ఏడాది మే నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 2.25 శాతం పెంచింది. ప్రస్తుతం రెపో రేటు 6.25 శాతంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) బుధవారం పాలసీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. రిజర్వ్ బ్యాంక్ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం స్థాయిలో ఉంచే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి