Range Rover Velar: మార్కెట్లోకి కొత్త రేంజ్ రోవర్ వెలార్.. బుకింగ్స్ ప్రారంభం.. డెలివరీ ఎప్పుడంటే..
ల్యాండ్ రోవర్ భారతదేశంలో కొత్త రేంజ్ రోవర్ వెలార్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. కొత్త రేంజ్ రోవర్ వెలార్ డైనమిక్ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో HSEలో అందుబాటులో ఉంది. 2.0-లీటర్ పెట్రోల్, 2.0లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. కొత్త..
ల్యాండ్ రోవర్ భారతదేశంలో కొత్త రేంజ్ రోవర్ వెలార్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. కొత్త రేంజ్ రోవర్ వెలార్ డైనమిక్ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో HSEలో అందుబాటులో ఉంది. 2.0-లీటర్ పెట్రోల్, 2.0లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. కొత్త వెలార్ డెలివరీలు సెప్టెంబర్ 2023లో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కొత్త వెలార్ ఫ్రంట్ గ్రిల్‌తో పాటు DRLలతో కొత్త పిక్సెల్ LED హెడ్‌లైట్‌లు ఉన్నాయి. దీనికి రెండు కొత్త కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. మెటాలిక్ వారెసిన్ బ్లూ, ప్రీమియం మెటాలిక్ జెడ్డర్ గ్రే వంటి కలర్స్‌లో రానుంది.
న్యూ మూన్‌లైట్ క్రోమ్ వివరాలు దాని స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్, ఎయిర్ వెంట్‌లపై జోడించబడ్డాయి. ఇంటీరియర్‌లో షాడో గ్రే యాష్ వుడ్ వెనీర్ ట్రిమ్ ఫినిషర్లు కూడా ఉన్నాయి. కొత్త రేంజ్ రోవర్ వెలార్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 11.4-అంగుళాల కర్వ్డ్ నెక్స్ట్-జెన్ పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చింది కంపెనీ. అలాగే ఫోన్‌ను ఫాస్ట్ ఛార్జింగ్ వైర్‌లెస్ ఛార్జర్ ద్వారా చేసుకునే సదుపాయం ఉంది.
ముందుగా చెప్పినట్లుగా ఈ వాహనం రెండు ఇంజన్ ఆప్షన్‌తో ఉంది. 2.0లీటర్ పెట్రోల్ ఇంజన్ 247bhp, 365Nm ఉత్పత్తి చేయగలదు. అయితే దాని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 201bhp, 420Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వెలార్ ఎకో, కంఫర్ట్, గ్రాస్-గ్రావెల్-స్నో, మడ్-రట్స్, సాండ్, డైనమిక్, ఆటోమేటిక్ మోడ్‌లతో టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్‌ను కూడా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి