Rakshabandhan: మీరు రక్షాబంధన్ రోజున మీ సోదరికి ఈ బహుమతి ఇవ్వాలనుకుంటే.. రూ. 1500 ఈఎంఐతో ల్యాప్‌టాప్..
Rakshabandhan Gifts: ఇది టెక్నాలజీ యుగం.. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు మీ సోదరికి ల్యాప్‌టాప్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. మీ చెల్లి ఉద్యోగం చేసినా.. చదువుకుంటున్నా ఈ ల్యాప్‌టాప్ మీ సోదరికి చాలా ఉపయోగపడుతుంది. అది కూడా మీరు కోరుకున్న ధరలో.. అంటే సరసమైన ఈఎంఐలో చెల్లించుకునే అవకాశం ఉంది. అయితే మీరు మీ చెల్లికి నచ్చిన ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవచ్చు. ఈఎంఐని ఎవరు.. ఎక్కడ.. అందిస్తున్నారో ఇక్కడ తెలుసుకోండి.

ఇంట్లో అక్కా, చెల్లి చేసే సందడి.. రక్షా బంధన్ పండుగ అంటే ఓ ముచ్చట. అక్కా, చెల్లి.. తమ్ముడికి, అన్నకు రాఖీ కట్టి సంతోష పడితే.. తమ్ముడు, అన్నా ఆనందంగా ఇచ్చేదే బహుమతి. ఈసారి మీరు మీ సోదరికి ప్రత్యేకంగా ఏదైనా బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటే. ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. చాలా చక్కని బహుమతులను వారికి అందించవచ్చు. ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టాలని కోరుకునే విధంగా.. ప్రతి సోదరుడు ఈ సందర్భంగా తన సోదరికి ఏదో ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వాలని కోరుకుంటాడు.
ఇది టెక్నాలజీ యుగం, దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు మీ సోదరికి ల్యాప్‌టాప్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. మీ చెల్లి ఉద్యోగం చేసినా.. చదువుకుంటున్నా ఈ ల్యాప్‌టాప్ మీ సోదరికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఏమైనప్పటికీ ఆన్‌లైన్‌లో అనేక రకాల విక్రయాలు జరుగుతున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని మీరు తక్కువ EMIతో మీ సోదరికి ల్యాప్‌టాప్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు.
హెచ్‌పీ ల్యాప్‌టాప్ 15s
మీరు మీ సోదరికి హెచ్‌పీ ల్యాప్‌టాప్ 15లను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది చాలా సరసమైన ధరలో అమెజాన్‌లో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 8జీబీ RAMతో 512జీబీ మెమోరీ కూడా సపోర్టుతో ఇది చాలా బాగుంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ యుహెచ్‌డి గ్రాఫిక్స్, డ్యూయల్ స్పీకర్లు, విండోస్ 11తో కూడిన అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. ఇది మీ సోదరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అమెజాన్ నుంచి కొనుగోలు చేస్తే.. మీకు రూ.28,900 లభిస్తుంది. మీరు ఈఎంఐలో కొనుగోలు చేయాలనుకుంటే.. మీరు రూ.1392 వాయిదా చెల్లించాలి.
ఆసుస్ వివోబుక్ 15
ఈ ల్యాప్‌టాప్ అమెజాన్‌లో కూడా చాలా సరసమైన ధరలో లభిస్తుంది. ఈ ASUS ల్యాప్‌టాప్ Intel Celeron N4020 ప్రాసెసర్‌తో వస్తోంది. ఇది 15.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ పిక్సెల్ రిజల్యూషన్ 1366 x 768 వద్ద ఉంచబడింది. ఇది విండోస్ 11తో వస్తోంది. 37WHrs బ్యాటరీని కలిగి ఉంది. ఇది బాగా ఆకట్టుకుంటుంది. దీని ఆన్‌లైన్ ధర రూ. 25, 990, మీరు దీన్ని ఈఎంఐలో కొనుగోలు చేయాలనుకుంటే.. మీరు దీన్ని రూ. 1,248 ఈఎంఐ వద్ద కొనుగోలు చేయవచ్చు.
ఏసర్ వన్ 14
అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ Acer ల్యాప్‌టాప్‌లో 512GB నిల్వతో ఎంఎస్ ఆఫీస్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ AMD Ryzen 3 3250U ప్రాసెసర్, 8GB RAM, విండోస్ 11తో అమర్చబడింది. దీని 14-అంగుళాల డిస్‌ప్లే, పిక్సెల్ రిజల్యూషన్ 1366 X 768 , యాస్పెక్ట్ రేషియో 16:9. ఈ ల్యాప్‌టాప్ ఆన్‌లైన్‌లో కేవలం రూ. 28,990కి అందుబాటులో ఉంటుంది. మీరు దీన్ని ఈఎంఐలో కొనుగోలు చేయాలనుకుంటే.. మీరు నెలవారీ వాయిదాగా ప్రతి నెల రూ. 1,392 మాత్రమే చెల్లించాలి.
Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)
మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం




