PVR INOX: పీవీఆర్‌ ఐనాక్స్‌, ఖుషీ అడ్వర్టైజింగ్‌తో కీలక ఒప్పందం..

ప్రకటనల రంగంలో ఖుషీ అడ్వర్టైజింగ్ ఐడియాస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ 20 ఏళ్లకుపైసగా మార్కెట్‌ అనుభవం ఉంది. వివిధ మాధ్యమాల ద్వారా సమర్థవంతమైన ప్రకటనలను రూపొందించడంలో ఖుషీ అడ్వర్టైజింగ్ ప్రసిద్ధి చెందింది. 35 నగరాల్లో విస్తరించి, 250 మందికి పైగా నిపుణులు, 70 కంటే ఎక్కువ ఆపరేషన్స్ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందంతో ఈ రంగంలో రాణిస్తోందీ కంపెనీ...

PVR INOX: పీవీఆర్‌ ఐనాక్స్‌, ఖుషీ అడ్వర్టైజింగ్‌తో కీలక ఒప్పందం..
Pvr Inox
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 09, 2024 | 4:14 PM

భారతదేశంలో అతిపెద్ద, ప్రీమియం ఫిల్మ్‌ ఎగ్జిబిటర్‌గా పేరు సంపాదించుకుంది పీవీఆర్‌ ఐనాక్స్‌. భారత్‌లోపాటు శ్రీలంకలో మొత్త 111 నగరాల్లో 357 ప్రాపర్టీలతో, 1750 స్క్రీన్‌లతో, 3,57,000 సీట్ల కెపాసిటీతో సినిమా రంగంలో దూసుకుపోతున్న ఈ సంస్థ తాజాగా.. ఖుషీ అడ్వర్టైజింగ్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. పీవీఆర్‌ దీర్ఘకాల వ్యాపార భాగస్వామి, ఖుషీ అడ్వర్టైజింగ్ ఐడియాస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 2025 ఏడాదికి కాగను ప్రకటనల కోసం ఒప్పందాన్ని చేసుకుంది.

ప్రకటనల రంగంలో ఖుషీ అడ్వర్టైజింగ్ ఐడియాస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ 20 ఏళ్లకుపైసగా మార్కెట్‌ అనుభవం ఉంది. వివిధ మాధ్యమాల ద్వారా సమర్థవంతమైన ప్రకటనలను రూపొందించడంలో ఖుషీ అడ్వర్టైజింగ్ ప్రసిద్ధి చెందింది. 35 నగరాల్లో విస్తరించి, 250 మందికి పైగా నిపుణులు, 70 కంటే ఎక్కువ ఆపరేషన్స్ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందంతో ఈ రంగంలో రాణిస్తోందీ కంపెనీ. PVR-INOX, Cinepolis, Miraj, NY సినిమాస్, UFOతో పాఉ QCNలతో సహా వివిధ మల్టీప్లెక్స్, సింగిల్ చెయిన్‌లలో 9,000+ స్క్రీన్‌ల విస్తృత నెట్‌వర్క్‌ను ఖుషీ నిర్వహిస్తోంది.

ఖుషీ అడ్వర్టైజింగ్‌తో ఈ కొత్త భాగస్వామ్యం PVR-INOX కోసం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. ఐదేళ్ల కాంట్రాక్ట్‌లో భాగంగా దక్షిణ భారత మార్కెట్‌లో సినిమా ప్రకటనల విక్రయాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఖుషీ అడ్వర్టైజింగ్‌ను ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన యాడ్-సేల్స్ అనుబంధంగా నియమించారు. ఈ భాగస్వామ్యం సినిమా ప్రకటనల భవిష్యత్తు సంభావ్యతపై బలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది గత సంవత్సరం 36% ఆకట్టుకునే వృద్ధి రేటును సాధించింది. భారతీయ మీడియా రంగంలో ఇదే అత్యధికంగా కావడం విశేషం.

పీవీఆర్‌ ఐనాక్స్‌ రెవెన్యూ అండ్‌ ఆపరేషన్స్‌ సీఈఓ గౌతమ్‌ దత్తా ఈ విషయమై మాట్లాడుతూ.. ‘పరిశ్రమలోని ఇద్దరు నాయకుల మధ్య ఈ కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం లావాదేవీ విలువను మించిపోయింది. సంప్రదాయకంగా, ప్రకటనల విక్రయాలు కలిపి తమ మొత్తం ఆదాయంలో 10-11 శాతం అందించాయి. అయితే కోవిడ్ తర్వాత, మేము రికవరీ మార్గంలో ఉన్నందున ఆ సహకారం దాదాపు 7-8%కి పడిపోయింది. ఈ భాగస్వామ్యం, మా కొనసాగుతున్న నాయకత్వ కార్యక్రమాలతో పాటు, మా యాడ్-సేల్స్ సహకారాన్ని బలోపేతం చేస్తుందని.. కోవిడ్ పూర్వ స్థాయికి తిరిగి రావడానికి మాకు సహాయపడుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఖుషీ అడ్వర్టైజింగ్ ఐడియాస్‌ ప్రైవేట్‌ లిమిడ్‌ శ్రీ విష్ణు తెలంగ్‌ మాట్లాడుతూ.. ఖుషీ అడ్వర్టైజింగ్‌లో, మాల్స్, ఎయిర్‌పోర్ట్‌లత పాటు కార్పొరేట్ పార్క్‌ల వంటి ప్రత్యేక వేదికలను ఉపయోగించి.. భారతదేశం అంతటా సమీకృత OOH సొల్యూషన్‌లను అందించడంలో తాము రాణిస్తామని తెలిపారు. బ్రాండ్ విజిబిలిటీని పెంచడంపై దృష్టిసారించినట్లు చెప్పుకొచ్చారు. PVR ఐనాక్స్‌తో కలిసి, తాము ప్రకటనల ఆదాయాలను మెరుగుపరచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..