AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal loans: పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా.. ఇవి తెలుసుకొని ముందుకెళ్లండి..

బయట వ్యాపారులకన్నా ఇక్కడ వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. వివిధ అవసరాల కోసం బ్యాంకులు పర్సనల్ లోన్లు మంజూరు చేస్తాయి. అయితే పర్సనల్ లోన్ తీసుకునే ముందు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మిలిగిన రుణాలతో పోల్చితే వీటికి ఎక్కువగా వడ్డీ ఉంటుంది. ఇంకా ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీలు కూడా వసూలు చేస్తారు. కాబట్టి లోన్ తీసుకునే ముందే ఈ కింద విషయాలపై అవగాహన పెంచుకోవాలి.

Personal loans: పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా.. ఇవి తెలుసుకొని ముందుకెళ్లండి..
Personal Loan
Madhu
|

Updated on: Oct 09, 2024 | 5:22 PM

Share

ప్రతి ఒక్కరూ తమ అవసరాల కోసం రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఆర్థిక అవసరాలు, వైద్య ఖర్చులు, అనుకోని సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని కోసం ప్రధానంగా బ్యాంకులను ఆశ్రయిస్తారు. బయట వ్యాపారులకన్నా ఇక్కడ వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. వివిధ అవసరాల కోసం బ్యాంకులు పర్సనల్ లోన్లు మంజూరు చేస్తాయి. అయితే పర్సనల్ లోన్ తీసుకునే ముందు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మిలిగిన రుణాలతో పోల్చితే వీటికి ఎక్కువగా వడ్డీ ఉంటుంది. ఇంకా ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీలు కూడా వసూలు చేస్తారు. కాబట్టి లోన్ తీసుకునే ముందే ఈ కింద విషయాలపై అవగాహన పెంచుకోవాలి.

వడ్డీరేటు.. బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకునే ముందు గమనించాల్సిన ప్రధాన అంశం వడ్డీరేటు. మీరు తీసుకున్న అప్పుకు మొత్తం ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే మీ క్రెడిట్ ప్రొఫైల్, బ్యాంకుల పాలసీలు, మీరు తీసుకునే రుణాన్ని బట్టీ వడ్డీ రేటు మారుతూ ఉంటుంది.

ప్రాసెసింగ్ ఫీజు.. పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు మన దగ్గర బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. మీ దరఖాస్తును పరిశీలించి, రుణం మంజూరు చేయడానికి విధించే చార్జీ ఇది. దీన్ని వన్ టైమ్ లో కట్టేయ్యాలి. బ్యాంకులను బట్టీ ఈ రేటు మారుతూ ఉంటుంది. తీసుకునే రుణంపై ఇది ఆధారపడి ఉంటుంది. పర్సనల్ లోన్ తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజును ఎంత వసూలు చేస్తున్నారో గమనించాలి.

ప్రీ పేమెంట్, ఫోర్ క్లోజర్ చార్జీలు.. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తర్వాత ప్రతి నెలా ఈఎంఐ రూపంలో వాయిదాలు చెల్లించాలి. అయితే మీ దగ్గర డబ్బులు ఉండి, రుణం లో కొంత మొత్తం తీర్చివేయాలనుకున్నప్పుడూ చార్జీలు వసూలు చేస్తారు. ఇలాంటి వాటిని ముందస్తు చెల్లింపులు, పాక్షిక చెల్లింపులు అంటారు. వీటికి కూడా బ్యాంకులు అదనపు చార్జీలు వసూలు చేస్తాయి. అవి రుణంలో రెండు నుంచి ఐదు శాతం వరకూ ఉండవచ్చు. కాబట్టి లోన్ తీసుకునే ముందే ప్రీ పేమెంట్, ఫోర్ క్లోజర్ చార్జీలు గురించి తెలుసుకోవాలి.

ఆలస్య చెల్లింపు రుసుములు.. ఈఎంఐలను సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు ఆలస్య రుసుములు విధిస్తాయి. ఆ చార్జీలు వాటి నిబంధనల మేరకు మారుతూ ఉంటాయి. కొంత నిర్ణీత మొత్తం, లేదా ఈఎంఐ అమౌంట్ ను బట్టి ఇంత శాతమని నిర్ణయిస్తారు. అయితే ఆలస్య చెల్లింపుల వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.

ఇతర చార్జీలు.. రుణం ఇచ్చేముందు కొందరు రుణదాతలు డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఫీజులు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులను వసూలు చేస్తారు. ఇవి సాధారణంగా చాలా తక్కువగా ఉంటాయి. అయితే రుణ గ్రహీతలు ముందుగా తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి నిబంధనలను పూర్తిస్థాయిలో చదవాలి.

ప్రధాన అంశాలు..

  • రుణాన్ని మంజూరు చేసేముందు బ్యాంకులు మన క్రెడిట్ స్కోర్ ను పరిశీలిస్తాయి. అది బాగుంటే తక్కువ వడ్డీకే మంజూరు చేస్తాయి. క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాలి.
  • రుణదాతల నిబంధనల ప్రకారం పర్సనల్ రుణాల వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని బాగా గమనించాలి. అన్ని బ్యాంకుల వడ్డీరేట్లను పరిశీలించాలి. ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ రుణం తీసుకోవాలి.
  • ఈఎంఐల కాలవ్యవధిని తక్కువగా ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలం చెల్లించడం వల్ల వడ్డీ బాగా ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఈఎంఐ మొత్తాన్ని పెంచుకుంటే, రుణంపై వడ్డీని ఆదా చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..