Ola Electric Scooter: ప్రారంభం కానున్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విక్రయాలు.. డెలివరీ ఎలా జరుగుతుందంటే..?

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వాహనదారులకు గుడ్‌న్యూస్‌. ఈ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది.

Ola Electric Scooter: ప్రారంభం కానున్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విక్రయాలు.. డెలివరీ ఎలా జరుగుతుందంటే..?
Ola Electric Scooter1
Follow us

| Edited By: KVD Varma

Updated on: Sep 09, 2021 | 5:17 PM

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వాహనదారులకు గుడ్‌న్యూస్‌. ఈ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ రోజు నుంచి అమ్మకాలు షురూ అవనున్నాయి. అయితే, ఈ స్కూటర్ కొనుక్కోవాలని..  మీరు ఓలా షోరూం కోసం వెతుకుతారేమో.. అది కుదరదు. ఎందుకంటే, ఈ వెహికిల్‌ అమ్మకాల ప్రాసెస్ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. జూలై నెలలో ఓలా ఎలక్ట్రిక్ ప్రీ-లాంచింగ్ బుకింగ్‌లను ప్రారంభించింది. 24 గంటల్లో లక్ష బుకింగ్‌లు వచ్చాయి. మొత్తం చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్న కస్లమర్లకు కంపెనీ ఇప్పుడు విండోను తెరిచింది. కంపెనీ డైరెక్ట్-టు-హోమ్ సేల్స్ మోడల్‌ని కూడా అనుసరిస్తోంది. అంటే కొనుగోలుదారు ఫార్మాలిటీని పూర్తి చేసిన తర్వాత స్కూటర్‌ను నేరుగా ఇంటికే డెలివరీ చేస్తారు.

ఈఎంఐ ఆప్షన్‌ ఓలా స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉండేందుకు పలు బ్యాంకులతో ఓలా సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌, కోటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ మహీంద్రా ప్రైమ్‌, టాటా క్యాపిటల్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, జన స్మాల్‌ ఫైనాన్స్‌, వంటి పలు బ్యాంకింగ్‌ , ఫైనాన్స్‌ సంస్థలు ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా కనీస ఈఎంఐ రూ. 2,999గా నిర్ణయించారు.

ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫీచర్స్‌ ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఎస్‌ 1, ఎస్‌ 1 ప్రో అంటూ రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. వీటిలో 8.5 కిలోవాట్‌ మోటార్‌, 3.97 కిలోవాట్‌ పర్‌ అవర్‌ ‍బ్యాటరీని అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 నుంచి 115 కిలోమీటర్లుగా ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 121 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు, కేవలం మూడు సెకన్లలో 40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోగలదు. ఇందులో ఎస్‌ 1 ధర రూ. 99,999లుగా ఉండగా ఎస్‌ 1 ప్రో ధర రూ.1,29,000లుగా ఉన్నాయి. ఓలా స్కూటర్‌ పది రంగుల్లో లభిస్తోంది.

Telangana Weather Report: రాగల మూడు రోజులలో తేలికపాటి వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ..!

AP Political Controversy: విహారం.. వివాదం.. ఏపీ మంత్రి రష్యా టూర్‌‌పై పొలిటికల్‌ రచ్చ..

Mahesh Babu: సూపర్ స్టార్ సినిమాలో కేజీఎఫ్ స్టార్.. మహేష్‏కు ధీటుగా బాలీవుడ్ స్టార్.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..