AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Balineni Srinivasa Reddy: విహారం.. వివాదం.. ఏపీ మంత్రి రష్యా టూర్‌‌పై పొలిటికల్‌ రచ్చ..

విహారం.. వివాదం.. ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యా టూర్‌ పొలిటికల్‌ కాంట్రవర్సీగా మారుతోంది. పది మంది సన్నిహితులతో కలిసి రష్యా వెళ్లారు మంత్రి. దీనిపై...

Minister Balineni Srinivasa Reddy: విహారం.. వివాదం.. ఏపీ మంత్రి రష్యా టూర్‌‌పై పొలిటికల్‌ రచ్చ..
Minister Balineni Srinivasa
Sanjay Kasula
|

Updated on: Sep 08, 2021 | 1:30 PM

Share

విహారం.. వివాదం.. ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యా టూర్‌ పొలిటికల్‌ కాంట్రవర్సీగా మారుతోంది. పది మంది సన్నిహితులతో కలిసి రష్యా వెళ్లారు మంత్రి. దీనిపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రులు స్పెషల్‌ ఫ్లైట్లలో తిరగడం ఏంటని ప్రశ్నించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు. ఇదంతా అక్రమ సంపాదనే అని, హవాల్‌ సొమ్మేనని ఆరోపించారు.

అక్రమ సంపాదనతోనే మంత్రి బాలినేని స్పెషల్‌ ఫ్లైట్‌లో వెళ్లారని ఆరోపించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్రంలో పెన్షన్లు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మంత్రులు విలాసాల్లో మునిగితేలుతున్నారని విమర్శించారు. స్పెషల్‌ ఫ్లైట్‌లో వెళ్లేంత డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. చీమకుర్తి గ్రానైట్‌ డబ్బులేనని ఆరోపించారు.

బాలినేని ఫ్లైట్‌లో ఉన్న ఫొటోను ట్వీట్‌ చేసి మరీ విమర్శలు చేసింది తెలుగుదేశం పార్టీ. నాయకులు తిరగడానికి ప్రత్యేక విమానాలు, ప్రజలు తిరగడానికి మాత్రం గుంతల రోడ్లా అని విమర్శించింది. రష్యా టూర్‌పై విమర్శలు రావడంతో రియాక్ట్‌ అయ్యారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. రష్యా టూర్‌ తన వ్యక్తిగతమని, స్నేహితులతో కలిసి వచ్చానని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ కూడా తనతో ఉన్నారని చెప్పారు. వ్యక్తిగత టూర్లను రాజకీయ వివాదం చేయడం ఏంటని ప్రశ్నించారు బాలినేని.

ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..

Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే