Aadhaar Card: మొబైల్ ఫోన్‌తో ఆధార్‌లో పేరు, పుట్టినతేదీలలో మార్పులు చేయవచ్చు..! ఎలాగో తెలుసుకోండి..
Aadhaar Card: మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీని మార్చవచ్చు. UIDAI సహాయంతో ssup.uidai.gov.in/ssup/ లో లాగిన్ అయ్యి మీ ఆధార్

Aadhaar Card: మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీని మార్చవచ్చు. UIDAI సహాయంతో ssup.uidai.gov.in/ssup/ లో లాగిన్ అయ్యి మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తరువాత మీరు చేయవలసిని పని గురించిన ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత కొన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేయాల్సి ఉంటుంది. వాటిని అప్‌లోడ్ చేసిన తర్వాత సేవా రుసుము రూ.50 చెల్లించాలి. దీని కోసం మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. అయితే మీరు పేరు, పుట్టిన తేదీని మార్చబోతున్న మొబైల్ నంబర్ ఆధార్‌లో నమోదై ఉండాలని గుర్తుంచుకోండి. ఈ మొబైల్ నెంబర్‌కి OTP వస్తుంది దాని నుంచి ఈ సేవలను అనుమతిస్తారు.
నియమం ఏమిటి ఆధార్ రూల్ ప్రకారం.. పుట్టిన తేదీలో ఒకసారి మాత్రమే మార్పులు చేయవచ్చు. అయితే కొన్ని మినహాయింపులలో మరికొన్ని అవకాశాలు కల్పిస్తారు. పుట్టిన తేదీని ఒకటి కంటే ఎక్కువసార్లు మార్చాలంటే ప్రత్యేక పద్దతిని సూచించారు. ఈ పని మొబైల్ లేదా ఇంట్లో కూర్చోవడం ద్వారా జరగదు. దీని కోసం మీరు మీ సమీప ఆధార్ కేంద్రానికి కచ్చితంగా వెళ్లాలి. ఆధార్ కేంద్రం నుంచి పుట్టిన తేదీని మార్చినట్లయితే పుట్టిన తేదీకి సంబంధించిన పత్రం, స్వీయ ప్రకటన, దీనిలో మీకు మీరే పుట్టిన తేదీని సవరించుకున్నట్లుగా నమోదు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ లేదా ఇమెయిల్ ఐడిని అప్‌డేట్ చేయడానికి కూడా ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి.
ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్ చేయడం కుదరదు భద్రత కోణంలో మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే సౌకర్యం లేదు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో మార్చితే ఇది తర్వాత అనేక సమస్యలకు దారితీస్తుంది. బ్యాంక్ ఖాతా, ఆన్‌లైన్ KYC ధృవీకరణ మొదలైనవి మొబైల్ నంబర్‌తో లింకై ఉంటాయి. అందువల్ల ఆన్‌లైన్ అప్‌డేట్ ధృవీకరించకుండా జరిగితే బ్యాంకింగ్ మొదలైన వాటిలో ఇబ్బంది ఉంటుంది. దీనిని నివారించడానికి మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడిని అప్‌డేట్ చేయడానికి మీరు పోస్ట్ ఆఫీస్ లేదా ఆధార్ కేంద్రానికి వెళ్లవలసి UIDAI తెలిపింది.