PPF: పీపీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయితే ఏమవుతుంది..? డబ్బులు తీసుకోవడం కుదరదా..?
పీపీఎఫ్ లో పెట్టుబడులు చాలామంది పెడుతూ ఉంటారు. అయితే చాలామందికి మినిమం అమౌంట్ గురించి అవగాహన ఉండదు. ప్రతీ ఏడాది కనీసం రూ.500 అకౌంట్ లో జమ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. అయితే అకౌంట్ ఇనాక్టివ్ అయితే ఏం కావాలి అనేది చూద్దాం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫండ్ కావడంతో డబ్బులకు భద్రత ఉంటుంది. అంతేకాకుండా రూ.500 నుంచి చిన్న మొత్తంలో ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. నెల నెలా లేదా ఏడాదికి ఒకసారి మీరు పొదుపు చేయాలనుకున్న డబ్బులు అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అవుతాయి. అయితే ఏడాదికి కనీసం రూ.500 తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్ధిక పరిస్థితులు, పొరపాటున ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీసం రూ.500 జమ చేయకపోతే ఏమవుతుంది.. అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందా..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
కనీసం రూ.500 జమ
ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో ఖచ్చితంగా రూ.500 జమ చేయాలి. లేకపోతే మీ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. మీరు బ్యాంక్ లేదా పోస్టాఫీస్ లో తెరిచిన పీపీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. అకౌంట్ యాక్టివ్ గా ఉంచేందుకు ప్రతీ ఏడాది ఖచ్చితంగా కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. ప్రతీ నెలా లేదా ఏడాదికి ఒకసారి లేదా ఒకేసారి పెద్ద మొత్తంలో పీపీఎఫ్ అకౌంట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
పెనాల్టీ ఎంత
మీరు మినిమం అమౌంట్ డిపాజిట్ చేయకపోతే పెనాల్టీ పడుతుంది. చెల్లించని సంవత్సరానికి రూ.50 జరిమానా విధిస్తారు. ఒకవేళ వరుసగా మూడేళ్లు కాంట్రిబ్యూషన్ చేయకపోతే రూ.150 జరిమానా విధిస్తారు. ఆ తర్వాత ఇదే విధంగా జరిమానా పడుతుంది. దీంతో పాటు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. మూడు సంవత్సరాలకు రూ.1500తో పాటు రూ.150 జరిమానా కట్టాల్సి ఉంటుంది. అనంతరం మీ అకౌంట్ వెంటనే యాక్టివ్ అవుతుంది.
అయితే మీ పీపీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయినా కూడా మీ అకౌంట్లోని డబ్బులపై వడ్డీ అనేది కొనసాగుతూ ఉంటుంది. అయిత చెల్లింపులు చేయని సంవత్సరాలకు సంబంధించి జరిమానా, చెల్లింపులు పూర్తి చేసే వరకు కొత్త పెట్టుబడికి అనుమతి ఉండదు. అకౌంట్ ఇనాక్టివ్ అయినా కూడా అకౌంట్ తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాల తర్వాత అది మెచ్యూర్ అవుతుంది. ఇక పీపీఎఫ్ నుంచి ఏడాదికి ఒకసారి అమౌంట్ విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.1 శాతంగా కొనసాగుతోంది.
