PM Kisan: నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు..స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను సైతం అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో భాగంగా రైతుకు ఏడాదికి రూ.6000 అందుతాయి. ఈ మొత్తం ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడతలుగా అంటే రూ.2000 చొప్పున..
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను సైతం అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో భాగంగా రైతుకు ఏడాదికి రూ.6000 అందుతాయి. ఈ మొత్తం ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడతలుగా అంటే రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ సర్కార్. ఇప్పటి వరకు రైతులకు 16వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 17వ విడత రావాల్సి ఉంటుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా మోడీ ఈ డబ్బులు విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల మొత్తాన్ని జమ కానున్నాయి.
డబ్బుల స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?
- ముందుగా పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్‌ను ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత Know Your Status అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు Get Data అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: Insurance Claim: 45పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. క్లెయిమ్ చేసుకోవడం ఎలా?
కేవైసీ తప్పనిసరి
పీఎం కిసాన్ యోజన ప్రయోజనం అందుకునే రైతులు కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ చేయని రైతులకు 17వ విడత డబ్బులు అందవని కేంద్రం చెబుతోంది. అలాగే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వాయిదా ఆగిపోతుంది. రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు చెబుతూ వస్తోంది. కొందరు రైతులు కేవైసీ చేయలేదని, వారికి వచ్చే విడత డబ్బులు అందవని స్పష్టం చేస్తోంది. అందుకే ఈ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా కేవైసీ పూర్తి చేసుకున్నవారికే వస్తుందని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: Aadhaar Update: ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఇన్‌యాక్టివ్‌గా మారుతుందా? కీలక సమాచారం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి