PM Kisan: రైతులకు గమనిక.. ఇక పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది అప్పుడే.. లేటేస్ట్ అప్డేట్ మీకోసం..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీ్మ్ ద్వారా అన్నదాతల ఖాతాల్లో రూ. 6000 నగదును జమ చేస్తుంది. అయితే ఈ డబ్బు ఒకేసారి కాకుండా విడతల వారిగా అందిస్తుంది.

PM Kisan: రైతులకు గమనిక.. ఇక పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది అప్పుడే.. లేటేస్ట్ అప్డేట్ మీకోసం..
Pm Kisan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 06, 2022 | 11:15 AM

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పీఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే (PM Kisan). చాలా కాలంగా దేశంలోని రైతులకు కనీస వ్యవసాయ సంబంధిత ఖర్చుల కోసం నగదును వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీ్మ్ ద్వారా అన్నదాతల ఖాతాల్లో రూ. 6000 నగదును జమ చేస్తుంది. అయితే ఈ డబ్బు ఒకేసారి కాకుండా విడతల వారిగా అందిస్తుంది. ఇప్పటివరకు 11 విడతలు డబ్బును రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. ఇక ఇప్పుడు 12వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 31న 11వ విడత నగదును విడుదల చేశారు ప్రధాని మోడీ. ఇందులో దాదాపు 10 కోట్ల మందికి పైగా రైతులకు ప్రభుత్వం ద్వారా అందించే నగదును అందుకున్నారు. ఇక ఇప్పుడు 12వ విడత నగదును ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో బదిలీ చేయవచ్చని సమాచారం.

ప్రతి సంవత్సరం ఈ పథకం మొదటి విడత నగదును ఏప్రిల్ 1 లేదా జూలై మధ్య బదిలీ చేస్తుంది కేంద్రం. అలాగే రెండవ విడతను ఆగస్ట్ నవబర్ మధ్యలో బదిలీ చేయగా.. మూడవ విడతను డిసెంబర్, మార్చి మధ్య బదిలీ చేస్తుంది. అలాగే పీఎం కిసాన్ 12వ విడత నగదు పొందాలంటే ముందుగా ఈకేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. జూలై 31లోపు E-KYC చేయనివారికి తదుపరి విడత నగదు రాదు.

E-KYCని ఎలా పూర్తి చేయాలి..

ఇవి కూడా చదవండి

* ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ కు లాగిన్ కావాలి.

* ఆ తర్వాత ఫార్మర్ కార్నర్ పై క్లిక్ చేసి E-KYC ట్యాబ్ పై క్లిక్ చేయాలి.

* ఆ తర్వాత మీకు కొత్త పేజీ ఒపెన్ అవుతుంది. అందులో మీరు ఆధార్ నంబర్ నమోదు చేసి సెర్చ్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.

* ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఓటీటీ వస్తుంది.

* ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

* ఆధార్ కార్డును అనుసంధానించబడిన మొబైల్ కు ఓటీపీ వస్తుంది.. దీంతో E-KYC అప్డేట్ చేయబడుతుంది.