PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. అన్నదాతల అకౌంట్లోకి పీఎం కిసాన్ తొమ్మిదో విడత డబ్బులు.. ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..
PM Kisan: రైతులకు ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
PM Kisan: రైతులకు ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేస్తూ వస్తుంది కేంద్రం. అయితే వీటిని విడతల వారిగా అందిస్తోంది ప్రభుత్వం. ఇటీవల 8 విడత డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేసింది. ఈ డబ్బులు జూలై 31 వరకు అందరూ రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. ఇక ఆ తర్వాత తొమ్మిదవ విడత డబ్బులను కూడా పంపిణి చేసే పనిలో ఉంది కేంద్రం. ఇప్పటివరకు రూ.1,37,354 కోట్ల రూపాయల సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పంపింది. దీంతో అన్నదాతల ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది.
అయితే పీఎం కిసాన్ పథకం తొమ్మిదవ విడత డబ్బులు ఆగస్ట్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు ఈ పథకంలో రిజిస్టర్ చేసుకొని వారుంటే.. వెంటనే మీ పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరాలంటే.. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. గత రెండు నెలల్లోనే 21 వేల కోట్ల రూపాయాలను వ్యవసాయం కోసం కేంద్రం రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసింది. ఇప్పటి వరకు కేంద్రం ప్రారంభించిన పథకాలలో అత్యంత విజయవంతమైన పథకం పీఎం కిసాన్. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బును పంపిణీ చేయడం వలన వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద రూ. 6000-6000 అందిస్తోంది కేంద్రం. అయితే ఇప్పుడు ఈ డబ్బును రూ. 24 వేలకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను నేషనల్ ఫార్మర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్, కిసాన్ శక్తి సంఘ్ చాలాసార్లు లేవనెత్తాయి.
ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే.. * ముందుగా పీఎం కిసాన్ పోర్టల్ pmkisan.gov.in ఓపెన్ చేయాలి. * ఆ తర్వాత FARMER CORNERS ఆప్షన్ పై క్లిక్ చేయాలి. * కొత్త ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. * ఆ తర్వాత మరో న్యూ విండో ఓపెన్ అవుతుంది. * అందులో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా పూర్తి చేయాలి. * ఆ తర్వాత బ్యాంక్ ఖాతా సమాచారాన్ని పూరించేప్పుడు.. , IFSC కోడ్‌ను సరిగ్గా నింపి దాన్ని సేవ్ చేయాలి. * ఆ తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ భూమి వివరాలు ఎంటర్ చేయాలి. * అందులో ఖాస్రా నంబర్, ఖాతా నంబర్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. * ఇప్పుడు మీ రిజిస్టర్ ప్రక్రియ పూర్తవుతుంది.