PM Kisan: మోదీ ప్రభుత్వం రైతుల కోసం మరో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో రైతులు చేరితే రూ.15 లక్షలు!

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రకరకాల స్కీమ్‌లను అందిస్తోంది. ఇప్పటికే ఎన్నో స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన మోడీ సర్కార్‌.. రైతుల కోసం..

PM Kisan: మోదీ ప్రభుత్వం రైతుల కోసం మరో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో రైతులు చేరితే రూ.15 లక్షలు!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 04, 2021 | 6:31 AM

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రకరకాల స్కీమ్‌లను అందిస్తోంది. ఇప్పటికే ఎన్నో స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన మోడీ సర్కార్‌.. రైతుల కోసం మరో స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అదే పీఎం కిసాన్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ స్కీమ్‌ యోజన(PM Kisan FPO Yojana) . ఈ పథకం ద్వారా రూ.15 లక్షలు అందించనుంది.

అన్నదాతలకు ఆదాయం మరింత రెట్టింపు చేయడానికి, వారికి ఆర్థికంగా ఎదిగేందుకు మద్దతు అందించేందుకు కేంద్ర సర్కార్‌ వివిధ రకాల పథకాలను అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను సైతం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులు అగ్రికల్చర్‌ బిజినెస్‌ ప్రారంభించడానికి మోదీ ప్రభుత్వం రూ.15 లక్షల వరకు అందిస్తోంది.

అయితే కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ స్కీమ్‌ను ప్రకటించింది. అయితే ఈ స్కీమ్‌లో ఎలా చేరాలో, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తదితర పూర్తి వివరాలు చాలా మందికి తెలియవు. ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ స్కీమ్‌ కింద రూ.15 లక్షలు పొందాలంటే 11 మంది రైతులు కలిసి ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడాల్సి ఉంటుంది.

ఈ పథకం పొందడం ద్వారా వచ్చే డబ్బులను విత్తనాలు, మందులు, ఎరువులు, ఇతర పరికరాలు రైతులకు విక్రయించుకోవచ్చు. అయితే దీనిలో చేరేందుకు రైతులు వేచి చూడక తప్పదు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం 2023-24 నాటికి 10 వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం ఐదేళ్లపాటు వీటికి సాయం అందిస్తుంది. ఒక్కో స్కీమ్‌కు మోదీ ప్రభుత్వం రూ.15 లక్షల రుణంగా అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించవచ్చు. ఇలాంటి పథకం ద్వారా రైతులు మరింతగా ఎదిగే అవకాశం ఉంటుంది. అయితే 2024 నాటికి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ కోసం దాదాపు రూ.6865 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. ఇది వస్తే రైతులకు ఎంతో కొంత ఆర్థికంగా ఎదిగేందుకు మంచి అవకాశం ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

Tea Plant: తేయాకును కొండ ప్రాంతాల్లోనే ఎందుకు పండిస్తారు..? కారణాలు ఏమిటి.? అసోం టీ ప్రత్యేకత ఏమిటి..?

Flipkart: పండగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్‌ అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయి చెల్లించకుండానే షాపింగ్‌.. ఎలాగంటే..!