PM Kisan: 21వ విడతకు ముందు ఈ 3 పనులు చేయనట్లయితే మీకు రూ.2000 రావు!
PM Kisan Scheme: ఈ పథకం కింద రైతు భూమి సమాచారం కూడా చాలా కీలకం. భూమి వివరాలు పాతవి లేదా తప్పుగా ఉంటే వాయిదా జమ కాదని గుర్తించుకోండి. దీని కోసం పీఎం కిసాన్ పోర్టల్‌కి వెళ్లి 'రైతు వివరాలు..

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళి నాటికి ఈ మొత్తం అందుతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పండుగలు ముగిశాయి. వాయిదా ఇంకా రాలేదు. డబ్బును త్వరలో బదిలీ చేయవచ్చని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకం (పిఎం కిసాన్ యోజన) కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తం సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున మూడు విడతలుగా మీ బ్యాంకు ఖాతాలోకి నేరుగా వస్తుంది. మీరు కూడా తదుపరి విడత కోసం వేచి ఉండి ఇప్పటివరకు మూడు పనులు చేయకపోతే మీ రూ. 2,000 మీ ఖాతాలోకి రాదు. అయితే చాలా మంది బ్యాంకు ఈ స్కీమ్‌కు సంబంధించి కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతూ వస్తోంది. ఈ పనులు చేయని వారికి డబ్బులు వేయడం లేదు కేంద్రం. అందుకే అన్నిఅప్‌డేట్స్ సరైనవిగా ఉన్నాయా? లేదా ? అనేది చూసుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి: Liechtenstein: ఇక్కడ రాత్రి పూట ఇళ్లకు తాళం వేయరు.. పోలీసులు ఉండరు.. దొంగలు ఉండరు!
1. బ్యాంక్ ఖాతా, IFSCని అప్‌డేట్ చేయండి:
ముందుగా మీ బ్యాంక్ ఖాతా, IFSC ని అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. పీఎం కిసాన్ నిధులు నేరుగా మీ ఖాతాకు బదిలీ అవుతాయి. మీ బ్యాంక్ వివరాలు పాతవి లేదా తప్పుగా ఉంటే, చెల్లింపులు ఆలస్యం కావచ్చు. మీ బ్యాంక్ ఖాతా, IFSC ని అప్‌డేట్ చేయడానికి ముందుగా PM కిసాన్ పోర్టల్‌లోకి లాగిన్ అయి “బ్యాంక్ వివరాలను సవరించు” అనే ఆప్షన్ పై క్లిక్ చేసి సరైన ఖాతా నంబర్, IFSC కోడ్‌ను నమోదు చేయండి.
2. ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్‌ను లింక్ చేయండి:
పీఎం కిసాన్ యోజన కింద మీ ఆధార్ కార్డు, మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం చాలా అవసరం. మీ ఆధార్ లేదా మొబైల్ నంబర్ తప్పుగా ఉంటే మీకు ఎటువంటి సమాచారం లేదా నిధులు అందవు. దీన్ని చేయడానికి పీఎం కిసాన్ పోర్టల్‌కి వెళ్లి ‘ఆధార్/మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసే ఆప్షన్‌పై క్లిక్ చేసి సరైన సమాచారాన్ని నమోదు చేయండి.
3. భూమికి సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్ చేయండి:
ఈ పథకం కింద రైతు భూమి సమాచారం కూడా చాలా కీలకం. భూమి వివరాలు పాతవి లేదా తప్పుగా ఉంటే వాయిదా జమ కాదని గుర్తించుకోండి. దీని కోసం పీఎం కిసాన్ పోర్టల్‌కి వెళ్లి ‘రైతు వివరాలు’ పై క్లిక్ చేయండి. భూమి వివరాలను తనిఖీ చేయండి. ఏదైనా తప్పిపోయిన సమాచారాన్ అప్‌డేట్ చేయండి.
పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు వస్తుంది?
పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలోని రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ 21వ విడత ఇప్పటికే జమ చేసింది కేంద్రం. ఇతర రాష్ట్రాలలోని రైతులకు అందాల్సి ఉంది. ఈ ప్రయోజనాన్ని ఎప్పుడు పొందుతారనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ మీడియా నివేదికల ప్రకారం, అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో 21వ విడత రూ. 2,000 మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయవచ్చని సమాచారం.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








